Site icon NTV Telugu

Animal : గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..?

Whatsapp Image 2023 11 25 At 1.42.41 Pm

Whatsapp Image 2023 11 25 At 1.42.41 Pm

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్..అర్జున్‌ రెడ్డి, కబీర్ సింగ్ సినిమలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మంధాన రణ్ బీర్ కపూర్ సరసన హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌లు కూడా విడుదల చేయగా.. సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక అర్జున్‌ రెడ్డి తర్వాత సందీప్ డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న మూవీ కావడం తో ఆడియెన్స్‌ ఏ రేంజ్‌ లో అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ వైలెంట్ మోడ్‌ లో కనిపిస్తుండటం తో ప్రేక్షకులలో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమా హిందీ తో పాటు తెలుగు లో కూడా డిసెంబర్‌ 1న ఎంతో గ్రాండ్‌ గా రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్‌ వేడుక ను మేకర్స్ ప్లాన్‌ చేశారు.ఇప్పటికే ముంబయిలో చేసిన ప్రమోషన్స్‌ కు ఊహించని స్థాయి లో రెస్పాన్స్‌ వచ్చింది. దాంతో తెలుగు లో కూడా అదే స్థాయి లో మేకర్స్ ప్రీ రిలీజ్‌ వేడుకను ప్లాన్‌ చేస్తున్నారు. దాని కోసం హైదరాబాద్‌ లోని మల్లారెడ్డి యూనివర్సిటీని వేదికగా ఎంచుకున్నారు. నవంబర్ 27 వ తేది న యానిమల్ మూవీ ప్రీ రిలీజ్‌ వేడుక జరుగనుంది. ఇక ఈ విషయాన్ని రణబీర్ కపూరే స్వయంగా వెల్లడించడం విశేషం. ఇక ఈ వేడుకకు ఓ టాలీవుడ్‌ స్టార్ హీరో గెస్ట్‌ గా రానున్నాడని సమాచారం.అయితే ఆ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం చిత్రయూనిట్ సస్పెన్స్ గా ఉంచింది..తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగె యానిమల్ మూవీ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపారు.

https://x.com/shreyasgroup/status/1728313175765086240?s=20

Exit mobile version