NTV Telugu Site icon

Anil Ravipudi : వెంకీ మూవీ కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకున్న అనిల్ రావిపూడి..?

Whatsapp Image 2024 05 12 At 12.18.22 Pm

Whatsapp Image 2024 05 12 At 12.18.22 Pm

Anil Ravipudi : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన సైంధవ్‌ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.ఈ సినిమాను హిట్ ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కించారు .ఈ సినిమాలో శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో ఆండ్రియా,ఆర్య కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ గా నటించారు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీనితో వెంకీ తన తరువాత సినిమాను అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్నాడు.

Read Also :Pushpa 2 : చార్ట్ బస్టర్ గా “పుష్ప పుష్ప” సాంగ్..పుష్ప రాజ్ మేనియా మాములుగా లేదుగా..

వెంకీ ,అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఎఫ్‌2, ఎఫ్ 3 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో మరో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.ఈ మూవీని మేకర్స్ ఆగస్టు లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడికి నిర్మాత దిల్‌ రాజు ఏకంగా రూ.15 కోట్ల చెక్‌ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.