Site icon NTV Telugu

Anil Ravipudi : చిరు నాగ్ కాంబో సెట్ చేస్తున్న అనిల్ రావిపూడి.. ఇక థియేటర్లు బద్ధలు కావాల్సిందే ?

New Project 2024 12 30t075629.900

New Project 2024 12 30t075629.900

Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నెంబ‌ర్ చిరంజీవి 156 అవుతుందా? 157 అవుతుందా? అన్నది మాత్రం కొద్ది రోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం ప్లానింగ్ జరుగుతోంది. వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడీ స్టోరీ విష‌యంలో అనిల్ టర్నింగ్ పాయింట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క‌థ‌ని కేవ‌లం చిరంజీవితో కాకుండా కింగ్ నాగార్జున‌తో క‌లిపి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడట. క‌థ‌లో కొన్ని ర‌కాల మార్పులు చేస్తే అది మ‌ల్టిస్టారర్ గా మార్చవచ్చని అనిల్ భావిస్తున్నాడట. ఇదే నిజ‌మైతే మెగా-కింగ్ అభిమానులు కోరిక తీరిపోతుంది. చిరంజీవి-నాగార్జుల‌ను ఒకే ప్రేమ్ లో చూడాల‌ని ఇద్దరి హీరోల అభిమానులు ఎంతో కాలంగా ఎదరు చూస్తున్నారు. ఇద్దరు ఎంత గొప్ప స్నేహితులు అన్నది చెప్పాల్సిన ప‌నిలేదు. వారిద్దరూ కలిసి బిజినెస్ లు కూడా చేస్తున్నారు. ఖాళీ స‌మ‌యం దొరికితే చిరంజీవి నాగార్జునతో కలిసి టైంపాస్ చేస్తుంటారు.

Read Also:IND vs AUS: కష్టాల్లో టీమిండియా.. 33 పరుగులకే ముగ్గురు కీలక ప్లేయర్స్ ఔట్

అలాంటి నాగార్జునతో కలిసి న‌టించాల‌ని మెగాస్టార్ చిరంజీవి చాలా కాలాంగా ఆశపడుతున్నారు. కానీ స్టోరీ సెట్ కాక‌పోవ‌డంతో వీలు పడలేదు. ఇప్పుడు అనిల్ రూపంలో చిరంజీవికి ఆ ఛాన్స్ దొరుకుతున్నట్లే అనిపిస్తుంది. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల‌ను గానీ, సీనియ‌ర్ హీరోల‌ను గానీ డీల్ చేయ‌డం అన్నది అనిల్ కి కొట్టిన పిండి. `ఎఫ్ -2`,` ఎఫ్ -3` చిత్రాల‌తో వెంక‌టేష్‌- వ‌రుణ్ తేజ్ ల‌ను డీల్ చేశాడు. ఆ కాంబోలో వ‌చ్చిన రెండు చిత్రాలు ఎలాంటి విజ‌యం సాధించాయో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిరు-నాగ్ ల‌ను మ్యానేజ్ చేయ‌డం పెద్ద విషయమేమీ కాదు. అయితే క‌థ అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్. అదీ అనిల్ మార్క్ స్టోరీ అవుతుందా? అందుకు భిన్నంగా ప్లాన్ చేస్తున్నాడా? అన్నది మాత్రం తెలియాలి. ఎఫ్ సిరీస్ చిత్రాల‌ను కామెడీ నేప‌థ్యంలోనే తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

Read Also:Bollywood : అమీర్ ఖాన్ ను వంశీ పైడిపల్లి మెప్పించ గలడా..?

Exit mobile version