Anil Ravipudi: కళ్యాణ్ రామ్, వెంకీలతో అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్.. 2027 సంక్రాంతికి వేట షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi: టాలీవుడ్లో తిరుగులేని కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ, వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తున్న మాస్ అండ్ క్లాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. హిట్ మిషన్‌గా పేరు సంపాదించుకున్న ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ తన మార్కు కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటిగా నిరూపించుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనశంకర వరప్రసాద్ గారు’ ఈ 2026 సంక్రాంతి బరిలో నిలిచి, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా, కాసుల వర్షం కురిపించింది. సంక్రాంతి పండగ పూట నవ్వుల జాతరను తీసుకొచ్చిన ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్ చేరిన సంగతి తెలిసిందే.
READ ALSO: Netanyahu’s ‘Love Story’: ఇండియాలో ఇజ్రాయెల్ ప్రధాని ‘లవ్ స్టోరీ’.. నవ్వు ఆపుకోలేకపోయిన పీఎం మోడీ!
Also Read
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ తన నెక్ట్స్ సినిమా పనుల్లో పడ్డారు. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తూ తన కొత్త సినిమా పనులను చకచకా స్టార్ట్ చేస్తున్నారు. హిట్‌మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కబోయే కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఈ రోజు అధికారికంగా వచ్చింది. ఈసందర్భంగా అనిల్ రావిపూడి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మొదటి “వందకోట్ల బొమ్మ” కొట్టిన హీరో.. విక్టరీ వెంకటేష్ గారితో, “మొదటిసారి బొమ్మ” తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారితో 2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం అని వెల్లడించారు. ఈ చిత్రాన్ని కూడా అనిల్ రావిపూడి సంక్రాంతి బరిలో నిలిపేలా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, కళ్యా్ణ్రామ్ల పాత్రలు ఎలా ఉంటాయి, హీరోయిన్స్‌గా ఎవరు కనిపించనున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరి వెంకటేష్ హీరోగా మూడు చిత్రాలు తెరకెక్కితే ఆ మూడు కూడా సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో కూడా వెంకీ కీ రోల్ ప్లే చేశాడు. హిట్మిషన్కు డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చింది నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా తెరకెక్కిన పటాస్ చిత్రంతోనే అనిల్ రావిపూడి డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్‌తో మళ్లీ సినిమా తీస్తుండటంతో నందమూరి అభిమానులు మస్త్ ఖుషీ అవుతున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా, స్టార్డమ్ తెచ్చుకున్నా.. తనకు లైఫ్ ఇచ్చిన హీరోని మర్చిపోకుండా మళ్లీ ఆయనతో సినిమా చేస్తుండటంతో అనిల్ రావిపూడిని కొనియాడుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచే ఈ సినిమాపై ఇప్పటి నుంచే మంచి హైప్ క్రియేట్ అవుతుంది.
మొదటి "వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరో.. Victory @VenkyMama గారితో🔥
"మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో @NANDAMURIKALYAN గారితో కలిసి 💥
2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం 😍😍😍#VenkyAnil5 #NKRxAR pic.twitter.com/WRVWdbQpbz
— Anil Ravipudi (@AnilRavipudi) February 26, 2026
READ ALSO: WEF President : ఎప్స్టీన్ ‘డార్క్’ లిస్ట్.. ప్రపంచ ఆర్థిక వేదిక బాస్ అవుట్.. ఆ విందులే కొంపముంచాయా?
తాజావార్తలు
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!