Anil Ravipudi: టాలీవుడ్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన మిగితా వారికన్నా సినిమా ప్రమోషన్స్‌ను విభిన్నంగా చేస్తారనే పేరు ఉంది. ఆయన తన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లే టెక్నిక్ సినిమా సినిమాకు చాలా కొత్తగా ఉంటుంది. నిజానికి అప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా ఆయన సినిమా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేసుకుంటూ.. తన చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడంలో సిద్ధహస్తుడిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
READ ALSO: Lava Blaze Duo 5G: మార్కెట్ లోకి లావా బ్లేజ్ డుయో 5G.. డ్యూయల్ OLED డిస్ప్లేలతో.. పూర్తి వివరాలివే..
ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన కొత్త సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇంతకీ ఆయన చేస్తున్న విభిన్న ప్రమోషన్ ఏంటో తెలుసా.. ‘ఏఐ’ సాంకేతికతను ఉపయోగించి క్రియేట్ చేసిన ఒక క్రేజీ వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోకు ఆయన ‘అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి.. ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ఈ వీడియోలో అనిల్ రావిపూడి.. మెగాస్టార్ హిట్ సినిమాల (ఖైదీ, ఇంద్ర, ఠాగూర్, శంకర్‌దాదా ఎంబీబీఎస్ మొదలైన) సెట్స్‌కి వెళ్లి అక్కడ మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ దిగడం కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీలో విక్టరీ వెంకటేష్ కూడా భాగం అయ్యారు. ఈ చిత్రం 2026 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Going with the trend 😃👌🏻
అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి, ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు🥳🥳🥳
Thanks to AI 😄
(‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు 😉)#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/o23yvZOlMw— Anil Ravipudi (@AnilRavipudi) December 21, 2025
READ ALSO: Health Tips: బాడీబిల్డర్ చావుకు కారణాలు ఏంటి? ఫిట్‌నెస్ ప్రపంచం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!