పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవ క్లీన్ స్వీప్ లు చేసిన ఘనత మాచర్ల ది.. టీడీపీ ప్రజా ప్రతినిధులకు భయం రుచి చూపించారు.. సామాజిక సాధికార యాత్రతో రాష్ట్రంలో ఒక చైతన్య యాత్రగా సాగుతుంది అని ఆయన పేర్కొన్నారు. అణగారిన వర్గాలు సీఎం జగన్ ను గుండెల్లో పెట్టుకున్నారు.. ప్రతి చోట వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారు.. టీడీపీకి బొంద పెట్టే రోజు వస్తుంది.. సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
Read Also: Yogi Adityanath: ఆడపిల్లల్ని వేధిస్తే రావణుడి గతి తప్పదు..
నలుగురు బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీలకు వైసీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది.. బీసీగా ఉన్న నాకు ప్రాధాన్యం ఉన్న మంత్రి పదవి ఇచ్చారు.. నా మీద ఎన్ని సాడిలు చెప్పినా జగన్ నన్ను వదలలేదు.. ఏ జన్మలో చేసిన పుణ్యమో జగన్ లాంటి నాయకుడి దగ్గర పని చేసే అవకాశం వచ్చింది.. తన కోసం ఉన్న మనుషులను జగన్ కాపాడు కుంటారు అని ఆయన తెలిపారు. నా బీసీలు, ఎస్సీలు అని ధైర్యంగా చెప్పే సీఎం జగన్.. ఎన్నికల కోసం దుష్ట చతుష్టయం సిద్దం అవుతున్నారు.. పక్క వ్యక్తి సీఎం అవ్వాలని పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి దత్త పుత్రుడు అంటూ అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ను దింపడం పవన్ తరం కాదు అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పొత్తు పెట్టుకొని వస్తున్న ఆ అబ్బ తరం కూడా కాదు.. ఎస్సీలు, బీసీలు, అండగా ఉంటే జగన్ ను ఎవరు ఏం చేయలేరు.. వెనుక బడిన వర్గాలను తన భుజం మీద మోసిన సీఎం జగన్ ను మన బుజాల మీద మోసే సమయం ఆసన్నమయింది.. అందుకే మళ్ళీ జగన్ సీఎం కావాలి అని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.