Site icon NTV Telugu

Anil Kumar Yadav : చంద్రబాబు అవినీతి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి

Anil Kumar Yadav

Anil Kumar Yadav

చంద్రబాబు అవినీతి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆధారాలతోనే సీఐడీ చంద్రబాను అరెస్ట్ చేసిందన్నారు. ఓటులకు కూడా పూర్తి వివరాలు సమర్పించడంతోనే బెయిల్ కు అవకాశం లేకుండా పోతోందని, చంద్రబాబు హయాంలో జరిగిన. స్కాం లు ఒక్కోటి బయటకు వస్తున్నాయన్నారు. ఆయనకు 23 నెంబర్ కలిసి వస్తోందని, ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడన్నారు. గత ఎన్నికల్లో ఆయనకు 23 సీట్లు వచ్చాయని, జైలుకు వెళ్లిన తేదీ కూడా 23 అని ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతల సైలెంట్ గా ఉంటే వైసీపీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల హడావుడి ఎక్కువగా ఉందన్నారు.

Also Read : Shilpa Shetty: డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సులతో ఆకర్షిస్తున్న శిల్పాశెట్టి

మునిగిపోయే పడవలో కూర్చున్న ఆ నేతలు ఎక్కువ రోజులు రాజకీయం చేయలేరని, నెల్లూరు జిల్లాలో ఒక నేత పెద్దమనిషి లాగా ముసుగేసుకుని తిరుగుతున్నారన్నారు. త్వరలో ఆయన కూడా లోపలికి వెళ్తారంటూ అనిల్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడే వారు వారి వయస్సుతో సంబంధం లేకుండా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటారని అనిల్ నొక్కి చెప్పారు. నేరం నేరమేనని, భవిష్యత్తులో చంద్రబాబు అదనపు కేసులు ఎదుర్కోవాల్సి రావచ్చని స్పష్టం చేశారు.

Also Read : Varasiddhi Vinayaka: కాణిపాకం విశిష్టత.. రోజు రోజుకి పెరుగుతున్న వినాయకుని విగ్రహం

Exit mobile version