IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకు 15 విభిన్న ఫ్రాంచైజీలు ఆడాయి. 2022లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జాయింట్స్ రాకతో జట్ల సంఖ్య 10కి చేరింది. అయితే.. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్‌కు ఇప్పటివరకు ఐపీఎల్లో ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో.. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా బీహార్‌కు ప్రత్యేక ఐపీఎల్ జట్టు ఉండాలని గట్టిగా ఆకాంక్షించారు.
బీహార్ మట్టిలో అద్భుతమైన క్రికెట్ ప్రతిభ దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. అత్యంత వేగంగా వన్డే డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ (పాట్నా), రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి సెంచరీలతో రికార్డులు సృష్టించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (సమస్తీపూర్), అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న సాకిబ్ హుస్సేన్ (గోపాల్‌గంజ్) వంటి ఆటగాళ్లను బీహార్ దేశానికి అందించిందని గుర్తుచేశారు. ఇంతటి ప్రతిభ ఉన్నప్పటికీ, బీహార్‌కు సొంత క్రికెట్ గుర్తింపు లేకపోవడం తనను ఎప్పుడూ కలచివేస్తుందని అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- SRH Vs RCB: ఉప్పల్‌లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరహాలోనే బీహార్‌కు కూడా ఒక అజేయమైన జట్టు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ యువతకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, మద్దతు లభిస్తే, అక్కడి నుండి వచ్చే జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం తాను పూర్తి స్థాయిలో, నిరభ్యంతరంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
విధ్వంసకర జట్టుగా మారుతుందా? నెటిజన్ల అభిప్రాయం..
అనిల్ అగర్వాల్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ఒకవేళ బీహార్‌కు కొత్త ఐపీఎల్ జట్టు వస్తే.. స్థానిక స్టార్లయిన ఇషాన్ కిషన్, రికార్డుల వీరుడు వైభవ్ సూర్యవంశీలను ఆ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే గనుక, అది ఐపీఎల్‌లోనే అత్యంత విధ్వంసకరమైన జట్టుగా మారుతుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల కాంబినేషన్ ఓపెనింగ్‌లో వస్తే CSK, MI, RCB వంటి దిగ్గజ జట్ల బౌలింగ్ లైనప్‌లు కూడా తట్టుకోలేవని విశ్లేషిస్తున్నారు.
సాధ్య సాధ్యాలు..
అనిల్ అగర్వాల్ వంటి బిలియనీర్ ‘అన్‌కండిషనల్ సపోర్ట్’ ఇస్తానని ప్రకటించడం వల్ల ఫ్రాంచైజీ కొనుగోలుకు , భారీ పెట్టుబడులకు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. బీహార్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అపారం. కొత్త జట్టు వస్తే వ్యూయర్షిప్, స్పాన్సర్షిప్ పరంగా బీహార్ ఐపీఎల్ జట్టుకు భారీ మార్కెట్ లభిస్తుంది. ఇషాన్, వైభవ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఇప్పటికే నిరూపించుకున్నారు కాబట్టి, జట్టుకు లోకల్ ఐడెంటిటీ మరియు బ్రాండ్ వాల్యూ త్వరగా వస్తుంది.
क्या आपको नहीं लगता Chennai Super Kings, Mumbai Indians और Kolkata Knight Riders की तरह बेमिसाल बिहार की भी एक टीम होनी चाहिए?
बिहार की मिट्टी ने देश को बहुत से बेहतरीन क्रिकेट खिलाड़ी दिए हैं।
पटना में जन्मे ईशान किशन ने सबसे कम गेंदों में ODI double century लगाई। समस्तीपुर… pic.twitter.com/bgScCh40Zd
— Anil Agarwal (@AnilAgarwal_Ved) May 22, 2026
ఒకవేళ కొత్త జట్టు వచ్చినా, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీలను నేరుగా జట్టులోకి తీసుకోలేరు. వారు ప్రస్తుతం ఆడుతున్న ఫ్రాంచైజీలు వదిలేస్తేనే, వేలంలో భారీ ధర చెల్లించి దక్కించుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ స్థాయి మ్యాచ్‌లను నిర్వహించడానికి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్టేడియాలు, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీహార్‌లో ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాల్సి ఉంది. ప్రస్తుతం ఐపీఎల్లో 10 జట్లు ఉన్నాయి. లీగ్ విండో పరిమితుల వల్ల త్వరలోనే మరో కొత్త జట్టును చేర్చుకునే ఆలోచనలు ప్రస్తుతానికి లేవని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ గతంలో సూచనప్రాయంగా తెలిపారు. 2028 నాటికి మ్యాచ్‌ల సంఖ్యను 74 నుండి 94కి పెంచే అవకాశం ఉన్నప్పటికీ, అది 10 జట్ల మధ్యే ‘హోమ్ అండ్ అవే’ ఫార్మాట్లో జరిగే అవకాశం ఉంది. కొత్త జట్ల చేరికపై బీసీసీఐ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, అనిల్ అగర్వాల్ చేసిన ప్రతిపాదన బీహార్ క్రికెట్ అభిమానుల్లో ఒక కొత్త చర్చకు, ఆశకు తెరలేపింది.
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్‌బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!