Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
- కొరియాలో ఫేమస్ అయిన గిల్గోరి టోస్ట్ ఇప్పుడు మీ ఇంట్లోనే
- క్యాబేజీ, గుడ్లతో హెల్తీ వెజిటబుల్ మిక్స్ తయారీ
- చీజ్ టచ్‌తో క్రిస్పీ శాండ్విచ్ సీక్రెట్ ఇదే
- పిల్లల లంచ్ బాక్స్‌కి 5 నిమిషాల్లో సూపర్ రెసిపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabbage Egg Sandwich : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొరియన్ ఫుడ్స్, వాళ్ల స్ట్రీట్ స్టైల్ వంటకాలకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా కొరియాలో ‘గిల్గోరి టోస్ట్’ (Gilgeori Toast) అని పిలిచే క్యాబేజీ ఎగ్ శాండ్విచ్ ఎంతో ఫేమస్. హెల్తీ వెజిటబుల్స్, ప్రోటీన్ రిచ్ ఎగ్స్ మరియు చీజ్ కాంబినేషన్‌తో తయారయ్యే ఈ టోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. మార్నింగ్ టైంలో ఆఫీస్‌కి వెళ్లేవారికి లేదా పిల్లల లంచ్ బాక్స్ కోసం క్విక్‌గా, ఈజీగా చేసుకోగలిగే ఈ కొరియన్ స్టైల్ శాండ్విచ్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే 'రాగి బిస్కెట్లు'.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
- Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
- Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
- Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ 'ఆలూ సమోసా'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
- బ్రెడ్ స్లైసులు
- ఎగ్స్ (గుడ్లు)
- క్యాబేజీ తురుము
- క్యారెట్ తురుము
- స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లిపొరక)
- చీజ్ స్లైస్
- బటర్ (వెన్న)
- టమోటో కెచప్ మరియు మయోనైస్ సాస్
తయారీ విధానం చాలా ఈజీ:
వెజిటబుల్ ఎగ్ మిశ్రమం సిద్ధం చేయడం:
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు గుడ్లను పగలగొట్టి వేయాలి. ఎగ్ సొనను స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, మరియు క్యాబేజీ తురుము వేసి ఆమ్లెట్ మిశ్రమం లాగా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
బ్రెడ్ టోస్ట్ చేయడం:
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా బటర్ వేసి స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసులను పాన్ పై ఉంచి, రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి. బటర్ బ్రెడ్‌కు బాగా పట్టేలా చూసుకుని, కాలిన బ్రెడ్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
క్యాబేజీ ఆమ్లెట్ వండడం:
బ్రెడ్ తీసేసిన అదే పాన్‌పై మరికొంత బటర్ వేసి, మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటబుల్ ఎగ్ మిశ్రమాన్ని పోయాలి. దాన్ని గరిటెతో బ్రెడ్ ఆకారంలో (చతురస్రంగా) సర్దుకుని, అవసరమైతే బ్రెడ్ సైజుకు తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. ఒక వైపు కాలిన తర్వాత నెమ్మదిగా రెండో వైపు తిప్పి, లోపల ఉన్న వెజిటబుల్స్ బాగా ఉడికే వరకు లైట్‌గా ప్రెస్ చేస్తూ కాల్చాలి. ఆమ్లెట్ పూర్తిగా కాలిన తర్వాత, స్టవ్ సిమ్‌లో ఉంచి దానిపై ఒక చీజ్ స్లైస్ పెట్టాలి. పాన్ వేడికి ఆ చీజ్ కాస్త కరగడం స్టార్ట్ అవుతుంది.
శాండ్విచ్ అసెంబ్లింగ్:
ఇప్పుడు మనం ముందుగా కాల్చి పెట్టుకున్న ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని, దానికి ఒక వైపు టమోటో కెచప్ నీట్‌గా రాయాలి. దానిపై మనం తయారు చేసుకున్న వేడివేడి క్యాబేజీ ఆమ్లెట్ (చీజ్ ఉన్న వైపు పైకి వచ్చేలా) సెట్ చేయాలి. ఇప్పుడు ఆమ్లెట్ పైన మీకు నచ్చినంత మయోనైస్ సాస్‌ను వేసుకోవాలి. చివరగా రెండో బ్రెడ్ స్లైస్‌ను దానిపై ఉంచి క్లోజ్ చేస్తే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ కొరియన్ స్ట్రీట్ టోస్ట్ రెడీ అయిపోతుంది.
దీన్ని చాకుతో మధ్యలోకి క్రాస్‌గా కట్ చేసి సర్వ్ చేస్తే చూడటానికి బాగుంటుంది, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. స్కూల్ లంచ్ బాక్స్‌లలోకి ప్యాక్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ అండ్ హెల్తీ ఛాయిస్.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?