Site icon NTV Telugu

Test Retirement: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!

Angelo Mathews Retire

Angelo Mathews Retire

Test Retirement: టెస్ట్ లవర్స్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ మధ్యనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాజాగా మరో సార్ క్రికెటర్ 17 ఏళ్ల టెస్ట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. అతడెవరో కాదు.. శ్రీలంక అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మాథ్యూస్ జూన్ 17న గాలెలో బంగ్లాదేశ్‌తో తన చివరి టెస్ట్ ఆడనున్నాడు. మాథ్యూస్ ఇప్పటికే వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.

Read Also: 2025 Kia Carens Clavis: ADAS లెవల్ 2 ఫీచర్, ఆరు ఎయిర్‌బ్యాగులతో కారెన్స్ క్లావిస్ లాంచ్.. వేరియంట్ వారీగా ధరల వివరాలు ఇలా..!

2023 లో న్యూజిలాండ్ తో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. తాజాగా టెస్టుల నుంచి కూడా తప్పుకోవడంతో.. ఇకపై టి20లో మాత్రమే కొనసాగనున్నాడు. 2009 లో ఆస్ట్రేలియాపై టీ20 డెబ్యూట్ చేసిన మాథ్యూస్ 2024లో నెదర్లాండ్స్ తో తన చివరి టీ20 ఆడాడు. మాథ్యూస్ తన టెస్ట్ రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ భావిద్వేగానికి గురయ్యాడు. సమయం ఆసన్నమైందని, తన 17 సంవత్సరాల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నానని మాథ్యూస్ చెప్పుకొచ్చాడు.

Read Also: 2025 Tata Altroz: టాటా ఆల్ట్రోస్ ఫేస్‌లిఫ్ట్ 2025 లాంచ్.. వివిధ వేరియెంట్ ధరలు ఇలా..!

ఈ జర్నీలో తనకు తోడుగా నిలిచిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ముగించాడు. శ్రీలంక తరఫున మాథ్యూస్ 118 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 44 సగటుతో 8,167 పరుగులు చేశాడు. అలాగే బౌలర్ గా 33 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 34 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం కూడా వహించాడు. గాలెలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో ఏంజెలో మాథ్యూస్ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు.

Exit mobile version