ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎంతోమంది స్టార్ హీరోల చేత స్టెప్పులు వేయించింది. ఎన్నో హిట్ సాంగ్స్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బుల్లి తెరపై పలు షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ మాస్టర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తాజాగా మాస్టర్ డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తన అసిస్టెంట్లతో కలిసి రీల్ వీడియోలు, డ్యాన్సులు చేస్తుంటుంది.. తాజాగా మాస్టర్ వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది.. ఈ క్రమంలో నీళ్లల్లో జారి కింద పడుతుంది. వర్షంలో వెరైటీగా రీల్ చేసేందుకు ప్రయత్నించిన ఆమె పట్టు తప్పి కింద పడిపోయింది. దీంతో మాస్టర్ ముఖానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. తాను క్షేమంగానే ఉన్నానని, ఎలాంటి గాయం కాలేదని యానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చింది. తన మీద ఇంత ప్రేమను చూపించిన అభిమానులకు చాలా థ్యాంక్స్ చెప్పింది.. సినిమాలతో బాగా పాపులర్ అయిన మాస్టర్ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది.. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని సందడి చేసింది.. 11వ వారంలోనే ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌లో కూడా ఓ క్యామియో రోల్ లో నటించింది.. ఇప్పుడు సితార కు డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహారిస్తున్నారు..