AP ZPTC & MPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌.. 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు..!

Election Results

Election Results

AP ZPTC & MPTC Election Results: రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా పోలైన పరిషత్ ఎన్నికల ఓటింగ్ కు సంబంధించి ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం బ్యాలెట్ పత్రాలను లెక్కించనున్నారు. ఇందుకోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు భద్రత, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఎలక్షన్స్ లో మొత్తం 577 ZPTC, 7,707 MPTC స్థానాలకు పోలింగ్ జరగ్గా.. 77 ZPTC, 2,051 MPTC స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

No liveblog updates yet.