NTV Telugu Site icon

Telangana Elections 2023: బాబు మోహన్‌కి షాక్ ఇచ్చిన తనయుడు!

Babu Mohan

Babu Mohan

Babu Mohan’s Son Uday Babu Kumar to Joins BRS: ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌కి ఆయన తనయుడు షాక్ ఇచ్చారు. బాబు మోహన్ కొడుకు ఉదయ్ బాబు కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని సమాచారం. నేడు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో ఉదయ్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. బీజేపీ ఆందోల్ టికెట్ ఆశించిన ఉదయ్ బాబు కుమార్‌కి నిరాశే ఎదురైంది. టికెట్ తన తండ్రి బాబు మోహన్‌కి ఇవ్వడంతో ఉదయ్ అసంతృప్తిలో ఉన్నారు.

తెలంగాణ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో బాబు మోహన్‌కి టిక్కెట్ దక్కలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయదల్చుకోలేదని, తాను ఎన్నికలతో సహా పార్టీకి దూరంగా ఉండబోతున్నానని చెప్పారు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి పార్టీకి కూడా రాజీనామా చేస్తా అని బాబు మోహన్‌ తెలిపారు. అయితే ఆ తర్వాత బాబు మోహన్‌కి ఆందోల్ టిక్కెట్ దక్కగా.. టిక్కెట్ ఆశించిన ఉదయ్ బాబు కుమార్‌కి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఉదయ్ బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారట.

Show comments