NTV Telugu Site icon

Andhra University: ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌ రాజీనామాలు..

Au

Au

Andhra University: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌ తమ పదవులకు రాజీనామా చేశారు.. గవర్నర్ కార్యాలయానికి రాజీనామా లేఖలు పంపినట్టుగా తెలుస్తోంది.. అయితే, రాజీనామాపై స్పందించేందుకు అందుబాటులోకి రావడం లేదు ప్రసాద్ రెడ్డి.. మరోవైపు.. రిజిస్ట్రార్ స్టీఫెన్ రాజీనామాకు ఆమోదం తెలిపారు.. దీంతో.. ఇంచార్జీ రిజిస్ట్రార్ గాకిషోర్ బాధ్యతలు స్వీకరించారు.. ఈ పరిణామాలతో వీసీ ఆఫీస్ ఎదుట బాణా సంచా పేల్చి.. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఏయూ పూర్వ ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు. కాగా, ఇప్పటి వరకు ఏయూ వీసీగా ఉన్న పీవీజీడీ ప్రసాదరెడ్డి.. యూనివర్సిటీని భ్రష్టు పట్టించారంటూ పలు సందర్భాల్లో ఆరోపణలు చేశాయి.. రాజీనామా చేయాలని డిమాండ్‌ కూడా చేస్తూ వచ్చాయి..

Read Also: Rahul Gandhi: ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా మైక్ కట్.. ఎక్స్‌లో వీడియో షేర్

మరోవైపు.. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌, రిజిస్ట్రార్‌కు ఆ మధ్యే బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.. యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ఉన్న వీవీజీ ప్రసాద్ రెడ్డి , రిజిస్ట్రార్‌గా ఉన్న జేమ్స్ స్టీఫెన్‌.. తమకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని.. వెంటనే తమ పదవికి రాజీనామా చేసి.. తప్పుకోవాలని వార్నింగ్‌ ఇస్తున్నారంటూ.. ఏయూ అధికారులు.. విశాఖ ⁠మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.. ఇక, ఏయూలో గోల్‌మాల్‌ జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి.. యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలను కూడా వీసీ వ్యాపారం చేశారని కొందరు ఆరోపించారు.. లక్షలాది రూపాయలు తీసుకుని పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించారంటూ.. స్వయంగా వర్సిటీలో పనిచేసే ఓ సీనియర్‌ ప్రొఫెసర్‌ ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారిన విషయం విదితమే.