Site icon NTV Telugu

Raksha Bandha: సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, ఎంపీలు, నేతలు

Rakhi

Rakhi

Raksha Bandha: తెలుగు రాష్ట్రాల్లో రక్షా బంధన్ సంబరాలు మొదలయ్యాయి.. కొందరు ఈ రోజే రాఖీ పండుగు జరుపుకుంటున్నారు.. తమ తోబుట్టువులకు రాఖీలు కడుతున్నారు. శుభాకాంక్షలు చెబుతున్నారు.. దీంతో.. రాఖీ షాపులు, స్వీట్‌ షాపులు కలకలలాడుతున్నాయి.. మరోవైపు.. ఎక్కువ ప్రాంతాల్లో రేపు రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. స్కూళ్లు కూడా రేపు సెలవు గా ప్రకటించాయి.. మొదట ఈ నెల 30న రక్షా బంధన్‌ సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రేపటికి ఈ నెల 31కి పోస్ట్‌ఫోన్‌ చేసింది.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి రాఖీలు కట్టి అభినందనలు తెలిపారు మహిళా మంత్రులు తానేటి వనిత, విడదల రజని, పలువురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు..

Read Also: BJP: మోడీ @ ది టెర్మినేటర్.. 2024లో మళ్లీ నేనే..

ఇక, రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.. వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు సీఎం జగన్‌.. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

 

 

 

 

 

 

 

 

Exit mobile version