Site icon NTV Telugu

Schools Bandh: అలర్ట్.. నేడు ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్!

Schools Bandh

Schools Bandh

విద్యార్థులకు అలర్ట్‌. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ స్కూళ్లకు సెలవు. ప్రైవేట్‌ స్కూళ్ల బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను మూసివేసినట్లు యాజమాన్యాల సంఘాలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తమ ఆవేదనను తెలిపేందుకే తప్ప.. ప్రభుత్వానికి అస్సలు వ్యతిరేకం కాదని వెల్లడించాయి.

స్కూళ్ల బంద్‌తో సమిష్టి ఐక్యతను అందరి దృష్టికి తీసుకెళ్లే చిరు ప్రయత్నం మాత్రమే అని ఏపీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్ తెలిపాయి. బంద్‌కు విద్యార్థులు, ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు సహకరించాలని కోరాయి. తప్పుడు ఫిర్యాదులపై త్రీ మెన్ కమిటీ దాడులు అపాలని‌ డిమాండ్ చేశాయి. ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కారించాలని డిమాండ్ చేశాయి.

Also Read: Horoscope Today: గురువారం దినఫలాలు.. ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు!

క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చే అగౌరవకరమైన సందేశాలు, హెచ్చరికలు తమను ఆవేదనకు గురిచేస్తున్నాయని ఏపీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్ తెలిపాయి. ప్రైవేటు పాఠశాలలను నిత్యం తనిఖీలు చేయడం, యాజమాన్యాలపై అతిగా స్పందించడం దురదృష్టకరం అని పేర్కొన్నాయి. ఆర్టీఈ ప్రవేశాల్లో తగిన ధ్రువీకరణ లేకుండా చేర్చుకోవాలని బలవంతం చేస్తున్నారని చెప్పాయి. పాఠశాలలను షోకాజ్‌ నోటీసులతో వేధించడం, గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించడం తగదు అని అసోసియేషన్స్ ఆవేదన వ్యక్తం చేశాయి.

Exit mobile version