Site icon NTV Telugu

Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి అంబటి.. ఇంకా దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు..!

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు పోలవరంలో పర్యటించారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.. ప్రాజెక్టులో దిగువ కాఫర్‌ డ్యాం వద్ద జరుగుతున్న డి వాటరింగ్‌ పనులపై ఆరా తీసిన ఆయన.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య ఉన్న సీ ఫేజ్‌ నీటి మళ్లింపు పనులను అడిగి తెలుసుకున్నారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు.. ప్రాజెక్టు పనులకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని పరిశీలించాం.. లోయర్‌, అప్పర్‌ కాఫర్‌ డ్యాంల మధ్య ఏరియాలో డీ వాటర్ వర్క్స్ జరుగుతోందని వెల్లడించారు.. ఇక, డీ వాటర్‌ వర్క్‌ అనంతరం వైబ్రో కాంపాక్ట్‌ పనులు మొదలవుతాయన్నారు అంబటి..

Read Also: Calling Sahasra: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘కాలింగ్ సహస్ర’ వచ్చేస్తోంది!

మరోవైపు.. పోలవరం లోయర్‌, అప్పర్‌ కాఫర్‌ డ్యాంల మధ్య.. సీఫేస్‌ ఎక్కువ ఉండటంతో పనులకు ఆటంకం కలుగుతుందని తెలిపారు మంత్రి అంబటి.. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది, దానికి సమాంతరంగా కొత్తది కట్టే అంశంలో కేంద్ర జలశక్తి శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.. కేంద్ర నిర్ణయాన్ని బట్టి.. కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ విషయంలో ముందుకు వెళ్లనున్నట్టు వెల్లడించారు.. ఇక, నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు.. 41.15 కాంటూరు వరకు గత ప్రభుత్వం హయాంలో వేసిన అంచనాకు నేటికి ఖర్చు పెరిగిపోయిందన్న ఆయన.. 41.15 కాంటూరు వరకు రూ.31,625 కోట్లతో సీడబ్ల్యూసీ రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీకి బిల్లు పంపించామని.. 45.72 కాంటూరు వరకు మరో రూ.16 వేలు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు.. 41.15 కాంటూరు వరకు పూర్తియ్యాక మిగిలిన వాటి గురించి చర్యలు తీసుకుంటామన్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్టుకు.. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం వైఎస్‌ జగన్‌ కలిసిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి అంబటి రాంబాబు.

Exit mobile version