Site icon NTV Telugu

AP Government: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో ఏడాది ఉచిత వసతి..

Ap Govt

Ap Govt

AP Government: హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. గతంలో ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఏడాది జూన్‌ వరకు ఉచిత వసతి అవకాశం ఉండగా.. 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకూ ఉచిత వసతి, ట్రాన్సిట్ వసతి కల్పిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం, హెచ్‌వోడీలు, హైకోర్టు, రాజ్ భవన్‌లో విధులు నిర్వహించే ఉద్యోగులకు విజయవాడ, గుంటూరు వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించిన వసతి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా.. సచివాలయం, వివిధ శాఖలకు సంబంధించిన హెచ్‌వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని పునరుద్దరిస్తూ ప్రభుత్వం ఊరట కల్పించింది. కాగా, సచివాలయ, హెచ్‌వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఉచిత వసతిని ఎత్తివేస్తున్నట్టు గతంలో ఉత్తర్వులిచ్చింది ఏపీ ప్రభుత్వం.. కానీ, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో ఉచిత వసతి సౌకర్యాన్ని పునరుద్ధరించిన విషయం విదితమే.

Read Also: Viral Video : థియేటర్లో షారుఖ్ పాటకు డ్యాన్స్ చేసిన యువకుడు.. నెటిజన్స్ ఫిదా..

Exit mobile version