Andhra Pradesh: మాలలు, మాదిగలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వివిధ ఆందోళనల సమయంలో మాల, మాదిగలపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. ఇక, ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రులు, ఆ సామాజిక వర్గం నేతలు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసిన ఎస్సీ మంత్రులు, మాల, మాదిగ నాయకులు.. వివిధ సందర్భాల్లో దళితులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.. కేసుల ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసన వారిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, హోం మంత్రి తానేటి వనిత, మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, నందిగాం సురేష్ బాబు, జూపూడీ ప్రభాకర్‌రావు తదితర నేతలు ఉన్నారు.
Read Also: Bhatti Vikramarka: దేశంతో పోటీపడాలనే రూపకల్పనతోనే శ్వేతపత్రం
