NTV Telugu Site icon

YS Jagan Pulivendula Tour: ఎన్నికల తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వైయస్ జగన్

Ys Jagan

Ys Jagan

YS Jagan Pulivendula Tour: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. రేపు(జూన్‌ 22న) పులివెందులకు వెళ్లనున్నారు వైఎస్‌ జగన్. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి కడపకు చేరుకోనున్నారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు పయనం అవుతారు. ఐదు రోజులపాటు పులివెందులలోనే మకాం వేయనున్నారు వైఎస్‌ జగన్. సోమవారం తిరిగి విజయవాడకు వెళ్లనున్న వైఎస్ జగన్.

Read Also: Nara Bhuvaneswari: అసెంబ్లీకి సీఎం చంద్రబాబు.. నారా భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్

ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి పులివెందుల నియోజవర్గానికి వైయస్ జగన్‌ వస్తుండడంతో ప్రాధాన్యత ఏర్పడింది. సీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. రోజుకో నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్‌ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అధైర్య పడకండి అండగా ఉంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా, ప్రజల్లోనే ఉండేందుకు వైఎస్ జగన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఏం చేయాలన్న దానిపై ముఖ్య నేతలతో ఐదు రోజులపాటు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఓదార్పు యాత్రకు వైయస్ జగన్ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.