AP Election 2024: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం రోజు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతోంది.. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది.. అయితే, పోలింగ్ సరలిని ఎప్పటికప్పుడు మానీటరింగ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది.. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది ఏపీ సీఈవో.. మొత్తం 36 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లల్లో ఎన్నికలను మానిటర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల లోపల.. వెలుపలా వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా వెబ్ కెమెరాల పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్.. జీరో వయొలెన్స్ పోలింగ్ లక్ష్యంగా పనిచేయాలన్న ఉద్దేశంతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటుకు పూనుకన్నారు. ఇక, ఈ కమాండ్ కంట్రోల్ రూంలో 200 మంది సిబ్బందిని పెట్టింది.. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళి పర్యవేక్షిస్తూ.. ఏదైనా సమస్యలు వస్తే.. వెంటనే ఉన్నతాధికారులకు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు.
Read Also: Mr Bachchan : మిస్టర్ బచ్చన్ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్..