NTV Telugu Site icon

INDGAP Certification : ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

Indgap

Indgap

INDGAP Certification : ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. గ్యాప్‌ సర్టిఫికేషన్‌ ద్వారా మన రాష్ట్ర అన్నదాతలు కష్టపడి నాణ్యమైన ప్రమాణాలతో పండించిన పంట దిగుబడులను తమకు జారీ చేసిన ధృవీకరణ పత్రముల ఆధారంగా ప్రీమియం ధరకు వారికి నచ్చిన చోట దేశీయంగా మాత్రమే కాకుండా యూరప్, యూఎస్‌తో సహా వందకు పైగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి వ్యాపారం చేసుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది.. మన దేశంలోని రైతులకు ఇచ్చే గ్యాప్‌ సర్టిఫికేషన్‌ను ఇండ్‌ గ్యాప్‌ సర్టిఫికేషన్‌గా ఇతర దేశాలు గుర్తిస్తాయి. రానున్న రోజుల్లో ఇండ్‌ గ్యాప్‌ సర్టిఫికేషన్‌ ప్రమాణాలను గ్లోబల్‌ గ్యాప్‌ సర్టిఫికేషన్‌ ప్రమాణాలతో సరిసమానం చేయడం జరుగుతుంది. అప్పుడు రైతులు పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో వాణిజ్యపరమైన డిమాండ్‌ అధికంగా ఏర్పడుతుంది.

Read Also: Chrisann Pereira: టాయిలెట్ వాటర్‌తో కాఫీ.. డిటర్జెంట్ సబ్బులో జట్టు కడుక్కున్న.. జైలు కష్టాలు చెప్పిన బాలీవుడ్ నటి

భారతదేశంలో మేలైన వ్యవసాయ పద్దతులను బలోపేతం చేసే సదుద్దేశంతో క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ పథకాన్ని అభివృద్ది చేసింది. దీనిని దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ది చేశారు. గ్యాప్‌ సర్టిఫికేషన్‌లో భాగంగా పండ్లు, కూరగాయలు, సంయోగ పంటలు, తేయాకు, గ్రీన్‌ కాఫీ, సుగంధ ద్రవ్యాలు అనే ఐదు విభాగాలుగా ధృవీకరణ చేయడం జరుగుతుంది. ఈ ధృవీకరణను వ్యక్తిగత రైతులు, రైతు బృందాల చేత చేయించవచ్చు. మన రాష్ట్రంలో ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ పథకం కింద ఏపీఎస్‌వోపీసీఏ ధృవీకరణ సేవలు అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇండ్‌ గ్యాప్‌ అమలుకోసం సుస్ధిర వ్యవసాయ ఆహార వ్యవస్ధలు అనే శీర్షికతో ఎఫ్‌ఏవో–టీసీపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒప్పంద పత్రాలను సీఎం సమక్షంలో మార్చుకున్న క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జక్సయ్‌ షా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.

Show comments