Site icon NTV Telugu

AP Cabinet: ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల.

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కగా.. జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది. ఓసీలకు 12 మంత్రి పదవులు కేటాయించగా.. బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి 8 మంత్రి పదవులను కేటాయించారు. ఎస్సీలకు 2 మంత్రిపదవులు కేటాయించగా.. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఒకరికి చోటు లభించింది. అలాగే మైనార్టీలకు కూడా ఒక మంత్రిపదవిని కేటాయించారు. సగానికి పైగా కొత్తవారికి అవకాశం లభించింది. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది.

మంత్రులు జాబితా ఇదే..
1. నారా చంద్రబాబు నాయుడు
2. నారా లోకేష్,
3. కొణిదెల పవన్ కళ్యాణ్
4. కింజరాపు అచ్చెన్నాయుడు
5. కొల్లు రవీంద్ర
6. నాదెండ్ల మనోహర్
7. నారాయణ
8. వంగలపూడి అనిత
9. సత్యకుమార్ యాదవ్
10. నిమ్మల రామానాయుడు
11. ఎన్.ఎమ్.డి.ఫరూక్
12. ఆనం రామనారాయణరెడ్డి
13. పయ్యావుల కేశవ్
14. అనగాని సత్యప్రసాద్
15. కొలుసు పార్థసారధి
16. డోలా బాలవీరాంజనేయస్వామి
17. గొట్టిపాటి రవి
18. కందుల దుర్గేష్
19. గుమ్మడి సంధ్యారాణి
20. బీసీ జనార్థన్ రెడ్డి,
21. టీజీ భరత్,
22. ఎస్.సవిత
23. వాసంశెట్టి సుభాష్
24. కొండపల్లి శ్రీనివాస్
25. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి.

 

Exit mobile version