Site icon NTV Telugu

Andhrapradesh: ‘వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌’లో ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్

Odop

Odop

Andhrapradesh: ఒక జిల్లా ఒక ఉత్పత్తి(వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ – ఓడీఓపీ)లో ఆరు ప్రతిష్టాత్మక అవార్డులను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అధికారులను సీఎం జగన్‌ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌-ఓడీఓపీలో ఒక్క ఏపీకే 6 అవార్డులు రావడం గమనార్హం.

Read Also: YSRCP: వైసీపీలోకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. సీఎం జగన్ సమక్షంలో చేరిక

ఉప్పాడ జామ్దాని చీరలు, అరకు కాఫీకి బంగారు పతకాలు రాగా.. పొందూరు కాటన్, కోడుమూరు గద్వాల్‌ చీరలకు కాంస్య పతకాలు లభించాయి. మదనపల్లె పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు లభించాయి. సామాజిక, ఆర్థిక అభివృద్దిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి, బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం – వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అధికారులు అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని కలిసిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఇతర ఉన్నతాధికారులు కలిశారు. వారిని సీఎం జగన్‌ అభినందించారు.

Read Also: AP Registrations: మొరాయిస్తున్న సర్వర్లు.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

కేంద్ర ప్రభుత్వంవన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకించి చేతివృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేసింది. అలాగే ఈ కార్యక్రమం కళాకారుల జీవనోపాధిని కూడా కాపాడింది. అంతేకాదు, ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. అరకు కాఫీ, సవర ఆదివాసీ పెయింటింగ్, చిత్తూరు టెర్రకోట, దుర్గి రాతి శిల్పాలు వంటి స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ద్వారా ఇది విజయవంతమైంది. రాష్ట్రం అంతర్గత వనరులను గుర్తించి, ఉపయోగించుకునే ప్రక్రియ ద్వారా ఒకే జిల్లా ఒకే ప్రోడక్ట్‌ (ఓడీఓపీ) చొరవ అట్టడుగు వర్గాలకు ఆర్థిక విలువను అందించింది.

Exit mobile version