Site icon NTV Telugu

Andhra King Taluka : ఇది మిస్ అయితే నిజంగా బాధపడేదాన్ని – భాగ్యశ్రీ

Bhagyasree Ram

Bhagyasree Ram

రామ్‌ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ . రిలీజ్ అవ్వకముందు నుంచే దీనిపై చాలా అంచనాలు ఏర్పడాయి, ఇప్పుడు కథ పరంగా రామ్ యాక్టింగ్ జనాలకు బాగా కనెక్ట్ అయింది. కుటుంబ ప్రేక్షకులు, అభిమానులు సినిమాను సూపర్ హిట్ చేయడంతో, టీమ్ అంతా కలిసి తాజాగా ఓ సక్సెస్‌మీట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేసింది. ఈ ఫంక్షన్‌లో హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు చిత్ర యూనిట్ చాలా ఉత్సాహంగా కనిపించింది. ఈ సందర్భంగా మాట్లాడిన భాగ్యశ్రీ, సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌కి చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. ఈ ప్రాజెక్ట్ మీద, తన పాత్ర మీద తనకు ఎంత నమ్మకం ఉందో కూడా బయటపెట్టింది. ముఖ్యంగా, తను చేసిన పాత్రకు జనాల నుంచి మంచి స్పందన రావడం పట్ల ఆమె చాలా సంతోషంగా వ్యాక్తం చేసింది.

Also Read : Akhanda-2 : ‘అఖండ 2’ తో మారనున్న లెక్కలు!

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అవకాశం తనకు ఎంత ముఖ్యమో చెబుతూ, ఆమె భావోద్వేగంతో మాట్లాడింది.. ‘నిజం చెప్పాలంటే, ఈ సినిమాలో నేను నటించకపోయి ఉంటే చాలా బాధపడేదాన్ని. నా కెరీర్‌లో ఇది దొరికిన మంచి ఛాన్స్. ఇంత మంచి పాత్రను వదులుకుని ఉంటే పక్కా ఫీల్ అయ్యేదాన్ని’ అని ఆమె మనసులో మాట చెప్పింది. భాగ్యశ్రీ చేసిన ఈ కామెంట్స్..  అందరి దృష్టినీ ఆకర్షించాయి. కథ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది, ఆమె పాత్ర జనాలకి ఎంత బాగా నచ్చిందో తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా రామ్‌ పోతినేనితో ఆమె కెమిస్ట్రీ కూడా స్క్రీన్ మీద బాగా పండిందని క్రిటిక్స్ కూడా మెచ్చుకున్నారు. మొత్తానికి ఆమె మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Exit mobile version