NTV Telugu Site icon

Asian Athletics Championship: ఆసియా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రా అమ్మాయి..

Jyothi

Jyothi

బ్యాంకాక్ లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్ లో జ్యోతి యర్రాజీ బంగారు పతకం సాధించింది. జూలై 13న జరిగిన ఈ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన క్రీడాకారిణి జ్యోతి యర్రాజీ.. తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది.

Dadisetti Raja: 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన సముద్రంలో కలిసిపోవడం ఖాయం

మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచిన జ్యోతి యర్రాజీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. థాయ్‌లాండ్‌లో జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన వైజాగ్‌కు చెందిన మా స్వంత @జ్యోతియారాజీకి నా అభినందనలు మరియు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు. మీరు మా అందరినీ చాలా గర్వపడేలా చేసారు జ్యోతి! అని ట్విటర్ ద్వారా అభినందనల జల్లు కురింపించారు.

Namratha Shirodkar :ఐదు పదుల వయసులో ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో నమ్రత..

ఇదిలా ఉంటే.. పురుషుల 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా.. కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన అబ్దుల్లా అబూబకర్ పురుషుల ట్రిపుల్ జంప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. మహిళల 400 మీటర్ల ఫైనల్లో ఐశ్వర్య మిశ్రా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. పురుషుల డెకాథ్లాన్‌లో తన సత్తాను ప్రదర్శించి తేజస్విన్ శంకర్ కూడా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.