మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్ నగర్ కి చెందినటువంటి 8 ఎకరాల తుమ్మల చెరువు రాత్రికి రాత్రి మాయం చేశారని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మున్సిపాలిటీ చైర్మన్ కాంటికర్ మధుమోహన్ తో కలిసి కంప్లైంట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జాకు గురవుతున్నాయని, దాదాపుగా 15 సంవత్సరాల నుండి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అండ దండలతో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీలలో వారి అనుచరులు చెరువులను విచ్చలవిడిగా కబ్జాలు చేశారని, వీటిపై మా పార్టీ వాళ్లు పలుమార్లు ఎమ్మార్వో లకు, కమిషనర్లకు కలెక్టర్లకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇచ్చిన వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vivek Venkataswamy : v6, వెలుగు మీడియా హౌస్‌ను అనగదొక్కాలని చాలా ప్రయత్నాలు చేశారు…
ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం అవుతున్నాయి దీనికి నిదర్శనమే 8 ఎకరాల తుమ్మలచెరువు రాత్రికి రాత్రి మాయమైపోవడం. గతంలో ఈ నియోజకవర్గానికి సంబంధంలేని వ్యక్తి చేతుల్లో ఈ ప్రాంతం చాలా నష్టపోయింది మళ్లీ ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి భూసేకరణ ఇన్చార్జిగా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు మళ్లీ ఈ ప్రాంతం వారు చాలా నష్టపోతారని అన్నారు. హైడ్రా కేవలం హైదరాబాద్ కి పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అమలు కావాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నానని, కానీ సామాన్యులను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ శివకుమార్ గౌడ్, కౌన్సిలర్లు బోధ యాదగిరి రెడ్డి, రాజామోని రాజు ముదిరాజ్, జాపాల సుధాకర్, బిజెపి సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, మహేందర్ గౌడ్, స్వామి గౌడ్, వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Minister Narayana: త్వరలో ఏపీలో టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్!
