NTV Telugu Site icon

Vishnu priya: కేటుగాళ్ల పనికి దయనీయంగా మారిన యాంకర్ విష్ణుప్రియ పరిస్థితి

Vishnu Priya Casting Couch

Vishnu Priya Casting Couch

Vishnu priya: ‘పోవే పోరా’ షో ద్వారా క్రేజ్ సంపాదించుకుంది విష్ణుప్రియ. మొన్నా వచ్చిన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ తన వంతు అందాలు ఆరబోసి హాట్ టాపిక్ అయ్యింది. అంతకు ముందు ఓ సినిమాలో కూడా నటించినప్పటికీ అది విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమాలో ముద్దు సీన్లలో రెచ్చిపోయి నటించినట్లు అనిపించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. యాంకర్లలో ఈ రేంజ్ గ్లామర్ షో ఎవ్వరూ చేయలేరు అనే విధంగా ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ లలో ఫోటోలు ఉంటాయి. ఈమె ఫేస్ బుక్ ఖాతాను 3.7 మిలియన్ల ఫాలో అవుతుంటారు. ఇటీవల తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్టు చెప్పుకొచ్చారు విష్ణు ప్రియ.

Read Also: Puneet Rajkumar: ‘అప్పు’కు కర్ణాటక రత్న అవార్డు… ఒకే వేదికపైకి రజనీకాంత్, ఎన్టీఆర్

తన ఫేస్ బుక్ పేజీలో అశ్లీల వీడియోలు, ఫోటోలు పోస్ట్ అవుతున్నాయని దయచేసి కొన్ని రోజులు తనని అన్ ఫాలో చేయమని విష్ణుప్రియ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అటు తర్వాత ఈమె ఫేస్ బుక్ అంతా బాగానే ఉంది అనుకున్న తరుణంలో ఇప్పుడు మళ్లీ ఆమె ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందట. ఇదే విషయంపై ఆమె స్పందించారు. చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ తనకు కాల్ చేసి మరీ ఫేస్ బుక్ లో ఆ వీడియోలేంటని అడుగుతున్నారని వాపోయింది.

Read Also: Producer Shocking Gift to Wife: భార్యకు ఖరీదైన గిఫ్టు ఇచ్చిన ప్రొడ్యూసర్.. ఏం ఇచ్చాడో తెలిస్తే షాకే

యాంకర్ విష్ణుప్రియ పరిస్థితి చూసిన నెటిజన్లు. ఫేస్ బుక్‌లో తన అకౌంట్‌ను చూసి పాపం అంటూ జాలి పడుతున్నారు. ఈమె స్టేటస్‌లో వచ్చే బూతు బొమ్మలు చూడలేక తల పట్టుకుంటున్నారు. అన్‌ఫాలో చేస్తూ.. ఈమె పరిస్థితి తలుచుకుంటూ ఫీలవుతున్నారు. సైబర్ క్రైమ్‌ కు కంప్లైట్ చేసినా..ఎఫ్‌బీకి రిక్వెస్ట్ చేసినా.. తన అకౌంట్‌ తనకు కాకుండా పోవడంతో చేతులెత్తేశారు. ఇక చేసేదేం లేక.. అప్పటి నుంచి ఇప్పటి వరకు .. తనను ఫేస్ బుక్ లో అన్‌ఫాలో చేయండని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను వేడుకుంటూనే ఉన్నారు. అయితే ఇదంతా బానే ఉన్నా… విష్ణు ప్రియ ఫేస్ బుక్ హ్యాక్ చేసిన హ్యాకర్ మాత్రం రోజు రోజుకూ రెచ్చి పోతున్నాడు. విష్ణు ప్రియ స్టేటస్‌లో బూతు ఫోటోలు.. అశ్లీల వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. విష్ణు ప్రియతో పాటు.. తన ఫాలోవర్స్‌ను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్టేటస్‌లు చూసిన ఆమె ఫాలోవర్స్ ఆమె గురించి.. ఆలోచించి బాధపడుతున్నారు.

Show comments