NTV Telugu Site icon

Breaking : అనారోగ్యంతో ప్రముఖ లేడీ యాంకర్ హఠాన్మరణం.. అసలు ఏమైందంటే?

Shivani Sen

Shivani Sen

Anchor cum Live Host Shivani Sen Passed Away: ఈ మధ్య కాలంలో రకరకాల జబ్బులు చిన్నవయసులోనే చాలా మందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య అయితే గుండెపోటు కారణంగా ఏర్పడుతున్న మరణాలు ఎక్కువయ్యాయి. ఇక తాజాగా భారతదేశంలోని ప్రముఖ లైవ్ హోస్ట్‌లలో ఒకరైన శివాని సేన్ అర్దాంతరంగా కన్ను మూశారు. దేశంలో జరిగిన పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ శివాని సేన్ ఎపిలెప్టిక్ ఎటాక్ అనే బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్య కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. 2005లో ఆమె తొలిసారిగా ఒక ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవరించారు ఇక ఆ తర్వాత మన దేశంలో మాత్రమే కాదు ఇతర దేశాల్లో కూడా ఆమె హోస్ట్ గా వ్యవహరించారు.

Slumdog Husband: ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అడల్ట్ కంటెంట్ మూవీ కాదట!

కార్పొరేట్ ఈవెంట్స్, కాన్ఫరెన్స్‌లు, ప్రభుత్వ ఈవెంట్స్, మీడియా లాంచ్‌లు, కోటీశ్వరుల కుటుంబాలకు సంబంధించిన వివాహాలు, ఫ్యాషన్ షోలు ఇలా ఈవెంట్ ఏదైనా తన యాంకరింగ్‌తో ఆ ఈవెంట్‌కి శివాని సేన్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచేవారు. ఇక ఆమె హంస ఫర్ వెడ్డింగ్స్ అనే మ్యారేజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి పార్టనర్ గా ఉన్నారు. అలాగే తెలంగాణా చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీని కూడా స్థాపించారు. ఇక చిన్న వయస్సులోనే ఆమె చనిపోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. శివాని సేన్‌కు పెళ్లై ఒక బాబు కూడా ఉన్నట్లు చెబుతున్నా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నిజానికి ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన తెలంగాణ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమానికి కూడా ఆమె హోస్ట్ గా వ్యవహరించారు.