Site icon NTV Telugu

Anasuya: కేటీఆర్ సర్.. మీరు నిజమైన నాయకుడు.. అనసూయ ట్వీట్

Anasuya

Anasuya

Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జబర్దస్త్ ప్రోగ్రాం తో బాగా పేరు తెచ్చుకున్న అనసూయ.. ప్రస్తుతం ఆ షో మానేసి సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. తనకు నచ్చిన, నచ్చని అంశాల గురించి ఆమె సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ వివాదాల వలనే అనసూయ ఫేమస్ అయ్యింది. ఇక అనసూయకు మొదటి నుంచి కేసీఆర్, కేటీఆర్ అంటే ఎనలేని అభిమానం. ఎన్నోసార్లు.. ఎన్నో ఇంటర్వ్యూలలో ఆమె ఈ విషయాన్నీ బహిరంగంగా చెప్పుకొచ్చింది. ఇక నేడు తెలంగాణ ఎలక్షన్స్ లో బీఆర్ ఎస్ ఓటమి పాలైన విషయం తెల్సిందే. ఆ ఓటమిని కేటీఆర్ సైతం అంగీకరిస్తూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ పై ఆయన అభిమానులు స్పందిస్తున్నారు.

తాజాగా అనసూయ సైతం.. ఈ ట్వీట్ పై స్పందించింది. ” మీరు నిజమైన నాయకుడు సార్.. ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు.. బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తూ.. హైదరాబాద్ తో మళ్లీ మళ్లీ ప్రేమలో పడేటట్లు చేసినందుకు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version