Site icon NTV Telugu

Anasuya : అనసూయకు గుడి కడతా.. పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ అంటూ పూజారి షాకింగ్ కామెంట్స్

Anasuya

Anasuya

వెండితెరపై, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్లామర్ పాత్రలతోనే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనూ మెప్పిస్తున్న ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, తాజాగా అనసూయపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ మురళీశర్మ అనే ఒక పూజారి, వీరాభిమాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె పర్మిషన్ ఇస్తే ఏకంగా అనసూయకు గుడి కడతామని ఆయన పేర్కొనడం విశేషం.

Also Read : Chinmayi : అవకాశాల కోసం శరీరం అడిగేవాళ్లు – చిరు మాటలపై చిన్మయి షాకింగ్ కౌంటర్

ఒక ఇంటర్వ్యూలో మురళీశర్మ మాట్లాడుతూ.. అనసూయ అంటే తనకు అపారమైన గౌరవం అని, గతంలో తమిళనాడులో నటి ఖుష్బూకు గుడి కట్టిన తరహాలోనే అనసూయకు కూడా ఆలయాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.. ‘దీని కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, అనసూయ గారి అనుమతి కూడా తీసుకుంటాం. ఆమె అంగీకరిస్తే ఆలయ నిర్మాణ పనులు మొదలుపెడతాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల చర్చనీయాంశంగా మారిన శివాజీ-అనసూయ వివాదంలో కూడా మురళీశర్మ అనసూయ వ్యాఖ్యలకే తన మద్దతు ప్రకటించారు.

ఒక నటిపై ఉన్న అభిమానంతో ఏకంగా గుడి కడతామని ఓ అభిమాని బహిరంగంగా ప్రకటించడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ ‘గుడి’ ప్రతిపాదనపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఇలాంటి విషయాలపై అనసూయ చాలా బోల్డ్‌గా, స్పష్టంగా స్పందిస్తుంటుంది, మరి ఈసారి ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version