Pottel : యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం ‘పొట్టేలు’. సాహిత్ మోత్కూరి దర్శకుడు. సురేష్‌కుమార్ సడేగే, నిశాంత్ నిర్మాతలు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అభిమానులు ఆకట్టుకున్నాయి. పూర్తి గ్రామీణ వాతావరణంలోని సంప్రదాయాలు, నమ్మకాల సమాహారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కు మంచి బజ్ క్రియేట్ అయింది. ఒక పల్లెటూళ్ళో జరిగే కథలా, ఒక ఫ్యామిలీని ఊరంతా కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు, అలాగే పేద, ధనిక బేధం చూపిస్తూ, కథలో పొట్టేలు కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు, కొత్త పాయింట్ తో పొట్టేల్ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
Read Also:AP Crime: శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. అత్తా కోడళ్లపై అత్యాచారం.. ఆ తర్వాత..!
నటీనటుల పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, సాంకేతికంగా కూడా సినిమా చాలా బాగుందని తెలుస్తోంది. కొన్నేళ్లు గుర్తుండిపోయే సినిమా ఇది అని చిత్ర బృందం. వినోదం, సందేశం మేళవించిన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్, ప్రియాంకశర్మ, తనస్వి చౌదరి, నోయల్‌సేన్, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 25న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
Read Also:AR Rahman- Kamala Harris: కమలా హారిస్ ఎన్నికల ప్రచార సభకు ఏఆర్ రెహమాన్ వీడియో