Ananya Nagalla : అందం, అభినయం ఉన్నా అనన్యకు అలాంటి అవకాశాలే ఎందుకు వస్తున్నాయి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ananya Nagalla : యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియదర్శితో కలిసి మల్లేశం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ అమ్మడు మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘వకీల్ సాబ్’ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసి.. ఆ పాపులారిటీ మరింత పెంచుకుంది. ఆ తరువాత చిన్న సినిమాల్లో నటించిన ఈ భామకు అంతగా గుర్తింపు రాలేదు. తాజాగా ఈ అమ్మడు పొట్టేల్ అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అనన్య నాగళ్ల – యువ చంద్ర జంటగా ‘పొట్టేల్’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాహిత్ మొత్కూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పొట్టేలు నేపథ్యంతో రాబోతుంది. ఈ సినిమాను నలభై సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీశారు. ట్రైలర్, టీజర్ వచ్చిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను చూడడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also:Bomb Threat: 30 విమానాలను పైగా బాంబు బెదరింపులు.. 8 రోజుల్లో 120కి పైగా విమానాలకు
Also Read
‘పొట్టేల్’ సినిమాను అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుసగా ప్రమోషన్ ఈవెంట్లను ప్లాన్ చేసుకుంటోంది. ఇలా ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఇందులో భాగంగానే తాజాగా అనన్య నాగళ్ల ఓ చిట్ చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా తనకు వస్తున్న సినిమా అవకాశాల గురించి తొలిసారిగా పెదవి విప్పింది. ‘మీకు గ్లామరస్ పాత్రలు, యూత్‌ను ఎట్రాక్ట్ చేసే రోల్స్ ఎందుకు రావడం లేదు’ అంటూ తాజా ఇంటర్వ్యూలో అనన్య నాగళ్లకు విలేకర్ల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికామె ‘వాస్తవానికి అందరిలా నాకు కూడా యూత్‌ఫుల్ రోల్స్ చేయాలని ఉంటుంది. కానీ, చాలా మంది నాకు సీరియస్‌గా, మెచ్యూర్డ్‌గా ఉండే పాత్రలను మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అయినా నాకు దీనిపై ఎలాంటి కంప్లైంట్లు లేవు’ అంటూ అనన్య చెప్పుకొచ్చింది.
Read Also:Sanju Samson: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో నేను ఆడాల్సింది.. చివరి నిమిషంలో తప్పించారు: శాంసన్
ఇదే ఇంటర్వ్యూలో అనన్య నాగళ్ల ‘నాకు మంచి పెర్ఫార్మెన్స్ చేసేందుకు వీలు ఉండే రోల్స్‌ను ఆఫర్ చేస్తున్నందుకు ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను దానికి తగ్గట్లు కంటెంట్ ఇవ్వడం వల్లే మరిన్ని ఆఫర్లను అందుకుంటున్నాను. అలా నేను గ్లామరస్ రోల్స్‌కు కూడా దూరం అవుతున్నాను’ అంటూ వివరించింది. మొత్తానికి అనన్య నాగళ్ల తన కెరీర్ విషయంలో చాలా క్లారిటీగా ఉందని ఆమె చెప్పిన దానిని బట్టి అర్థం అయింది. ‘పొట్టేల్’ సినిమాను నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ బ్యానర్లపై నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించారు. ఇందులో అజయ్, నోయల్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. శేఖర్ చంద్ర దీనికి మ్యూజిక్ అందించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?