NTV Telugu Site icon

Ananya Nagalla : సైబ‌ర్ మోస‌గాళ్ల వ‌ల‌లో టాలీవుడ్ నటి.. చిక్కనట్టే చిక్కి..

Ananya Nagalla

Ananya Nagalla

Ananya Nagalla : ఈ మధ్యకాలంలో ప్రపంచంలో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసింది. తరచుగా ప్రపంచంలో చాలా చోట్ల సైబర్ మోసాల వల్ల అనేకమంది డబ్బులను పోగొట్టుకోవడమే గాక వాటి వల్ల జరిగిన అనర్ధాల వల్ల ప్రాణాలను కూడా కోల్పోయిన వారు చాలానే ఉన్నారు. ఈ విషయంలో పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నా.. కొంతమంది వారి వలలో చిక్కుకొని నష్టపోతున్నారు. ఇకపోతే తాజాగా టాలీవుడ్ చెందిన హీరోయిన్ సైబర్ మోసగాళ్లకు టార్గెట్ గా మారింది.

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లైన్ల రహదారిగా మార్చాలని కోరాం..

కాకపోతే., ఆమె వారి నుంచి చాలా తెలివిగా తప్పించుకుంది. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించిన నటి అనన్య నాగళ్ళ. ఈవిడ తాజాగా సైబ‌ర్ మోసగాల వలలో చిక్కేది. ఈమెకు జరిగిన సంఘటన తాజాగా ఆమె తెలుపుతూ.. తనకి ఓ కస్టమర్ కేర్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని తన ఐడితో ఉన్న ఓ సిమ్ కార్డుతో అక్రమ దావాదేవీలు జరుగుతున్నట్లుగా వారు చెప్పారని చెప్పింది. దీంతో ఆవిడ సిమ్ బ్లాక్ చేస్తున్నట్లుగా వారు హెచ్చరించారు.

South Central Railway: రద్దు చేసిన రైళ్లలో కొన్ని పునరుద్ధరణ.. రేపటి నుంచి యథావిధిగా..

ఒకవేళ అలా కాకుంటే మాత్రం ఆమె పోలీస్ క్లియరెన్స్ తెచ్చుకోవాలని వారు తెలిపారట. అయితే ఆ సమయంలో ఆమె కాల్ ను పోలీసులకు చేస్తున్నట్లుగా వారు ఆమెని కన్ఫ్యూజ్ చేసారు. అంతేకాకుండా పోలీస్ క్లీరెన్సు కోసం ఆవిడను ముంబై రావాలని తెలిపారు. అంతేకాకుండా ఆమెను వీడియో కాల్ లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటూ ఆమె ఆధార్ నెంబర్ తీసుకున్నారు. ఆ నెంబర్ తో 25 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని ఆమె బ్యాంక్ అకౌంట్ నుండి ఓ వ్యక్తికి డబ్బులు పంపాలని., దాంతో ఆర్బిఐ మిగతా సంగతి చూసుకుంటుందని తెలిపారట. దాంతో అనుమానం వచ్చిన అనన్య అది ఫ్రాడ్ కాల్ అని గుర్తించి వారిపై ఎదురు తిరిగి మాట్లాడింది. తాను ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నట్టుగా చెప్పడంతో అవతల వ్యక్తి కాల్ కట్ చేశాడని ఆవిడ తెలిపింది. కాబట్టి ఇలాంటి బెదిరింపు కాల్స్ కు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.