Site icon NTV Telugu

Ananya Nagalla :కాలినడకన తిరుమలకు వెళ్లిన హీరోయిన్.. వీడియో వైరల్..

Anuu (2)

Anuu (2)

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య ఇటీవల వరుస సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది.. ఒకవైపు హీరోయిన్గా చేస్తూనే, సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా నటిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో యువతకు పిచ్చెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.. ఇక తాజాగా తాను కాలినడకన తిరుమలకు వెళ్లిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

తాజాగా ఈ అమ్మడు తంత్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..గత వీకెండ్ రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ నే అందుకుంది.. కలెక్షన్స్ ను కూడా గట్టిగానే రాబడుతుంది.. దీంతో మొక్కు తీర్చుకోవాలని తిరుమలకు వెళ్లింది.. కాలినడకన ఏడు కొండలు ఎక్కింది.. ఒంటరిగా వెళ్లినట్లు తెలుస్తుంది.. ఆమెకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఆ వీడియోలో అమ్మడు చాలా సింపుల్ గా కనిపిస్తుంది. సినిమా విషయానికొస్తే.. తన పై క్షుద్రపూజలు చేస్తారు.. దాని ప్రభావం ఎంతగా ఆమె పై ఉంటుంది. పిశాచి లతో ఎలా ఉంటుందో అనే కథతో సినిమా వచ్చింది.. ఈ సినిమా కథ కొత్తగా ఉండటంతో జనాల ఆదరణ లభించింది. మొత్తానికి మంచి టాక్ తో దూసుకుపోతుంది.. ఇక ఈ సినిమాను నరేష్ బాబు, రవి చైతన్య నిర్మించిన, శ్రీనివాస్ గోపిశెట్టి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోగా నటించిన ధనుష్ రఘుముద్రి.. హీరో శ్రీహరి సోదరుడు కొడుకు.. ఆర్ ఆర్ రుద్రన్ సంగీతాన్ని అందించారు..

Exit mobile version