భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలని కత్తితో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకొంది. రజాక్ అనే వ్యక్తికి అనంతపురం పట్టణానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లుగా రజాక్ భార్య షర్మిలపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె పరాయి పురుషులతో మాట్లాడడం సహించలేకపోయాడు. తరచూ ఆమెతో గొడవ పడ్డాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కోపంలో కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాల పాలైన ఆమె ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్నారు.
అనుమానపు మొగుడు.. హామీ పత్రం రాసివ్వాలన్నాడు!
