Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Empty Water Bottle saved 2 Months old Baby: అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో (జీజీహెచ్) జరిగిన హృదయ విదారక ఘటన తీవ్ర కలకలం రేపింది. చికిత్స పొందుతున్న 58 రోజుల పసికందును నానమ్మ ఆసుపత్రి భవనం పై అంతస్తు నుంచి కింద ఉన్న కాలువలో పడేసింది. అదృష్టవశాత్తూ కాలువలో ఉన్న ఖాళీ వాటర్ బాటిళ్లపై శిశువు పడటంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జీజీహెచ్ వైద్యులు వెల్లడించారు.
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కంచి సముద్రం పంచాయతీ పరిధిలోని మావిడాకులపల్లికి చెందిన పూజిత, అశోక్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 58 రోజుల ఆడశిశువు ఉంది. పాపకు ఫిట్స్ రావడంతో ఈ నెల 22న మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకువచ్చారు. వైద్యులు పీడియాట్రిక్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రి శిశువు నానమ్మ సత్యమ్మ పాపను ఎత్తుకుని వార్డు నుంచి బయటకు తీసుకెళ్లింది. కొంతసేపటి తర్వాత బిడ్డ కనిపించకపోవడంతో ఆసుపత్రిలో ఆందోళన నెలకొంది.
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్లారని సమాచారం రావడంతో వైద్యాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. పాపను నానమ్మే తీసుకెళ్లినట్లు గుర్తించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో పసికందు ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో సిబ్బంది గాలింపు చేపట్టారు. ఓపీ గది సమీపంలోని కాలువలో శిశువు పడి ఉండటాన్ని గుర్తించి.. వెంటనే బయటకు తీసి వైద్య చికిత్స అందించారు. పై అంతస్తు నుంచి విసిరేసిన సమయంలో కాలువలో ఉన్న ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై పడటంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆ దేవుడే కాపాడంటూ తల్లి పూజిత ఆనందం వ్యక్తి చేసింది.
ఈ ఘటనపై అనంతపురం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిశువు తండ్రి అశోక్ కుమార్‌తో పాటు నానమ్మ సత్యమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పసికందును ఎందుకు కాలువలో పడేశారనే అంశంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆడశిశువు కావడం వల్లే ఈ దారుణానికి పాల్పడ్డారా? లేదా మరే ఇతర కుటుంబ పరిస్థితులు కారణమా? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!