Site icon NTV Telugu

Anant Ambani Award: అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు.. మొదటి ఆసియా విజేతగా..

Anant Ambani

Anant Ambani

వన్యప్రాణుల సంరక్షణకు చేసిన అత్యుత్తమ కృషికి గాను వంతారా కన్జర్వేషన్ సెంటర్ వ్యవస్థాపకుడు అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఫర్ యానిమల్ వెల్ఫేర్ తో గ్లోబల్ హ్యుమానిటేరియన్ సొసైటీ సత్కరించింది. ఈ గౌరవంతో, అనంత్ అంబానీ ఈ ప్రపంచ గుర్తింపు పొందిన అతి పిన్న వయస్కుడు, మొదటి ఆసియా వ్యక్తిగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల సంరక్షణ నిపుణులు, యానిమల్ వెల్ఫేర్ లీడర్స్ హాజరైన అంతర్జాతీయ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.

Also Read:Lowest Temperatures: రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. అల్లూరి ఏజెన్సీని వణికిస్తున్న చలి!

ప్రపంచవ్యాప్తంగా జంతువులు, ప్రకృతిపై జీవితాంతం నిబద్ధత చూపిన వ్యక్తులను ఈ అవార్డు గుర్తిస్తుందని గ్లోబల్ హ్యూమన్ సొసైటీ వివరించింది. అనంత్ అంబానీ తన శాస్త్రీయ విధానం, ఎవిడెన్స్ బేస్డ్ కన్జర్వేషన్ వర్క్ కు గౌరవం లభించింది. వీటిలో పెద్ద ఎత్తున జంతు రక్షణ, పునరావాసం, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ, సైన్స్ ఆధారిత పరిరక్షణ కార్యక్రమాలు, ప్రపంచ జీవవైవిధ్యాన్ని రక్షించే ప్రయత్నాలు ఉన్నాయి. ఆయన చొరవ, వంతారా, ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన, ప్రభావవంతమైన పరిరక్షణ ప్రాజెక్టులలో ఒకటిగా పరిగణించారు.

Also Read:Starlink: అమెరికా, దుబాయ్, భూటాన్, బంగ్లాదేశ్‌లలో.. స్టార్‌లింక్ ప్లాన్ ధర ఎంతంటే?

అవార్డు అందుకున్న తర్వాత అనంత్ అంబానీ మాట్లాడుతూ.. “గ్లోబల్ హ్యూమన్ సొసైటీకి నేను కృతజ్ఞుడను. జంతువులు మనకు సమతుల్యత, వినయం, విశ్వాసాన్ని నేర్పుతాయి. అన్ని జీవులకు గౌరవం, సంరక్షణ, ఆశను అందించడమే వంతారా లక్ష్యం అని అన్నారు. గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అధ్యక్షుడు, CEO రాబిన్ గాంజెర్ట్ మాట్లాడుతూ, వంతారా కేవలం ఒక రక్షణ కేంద్రం మాత్రమే కాదు, చికిత్స, పునరావాసానికి స్వర్గధామం అని అన్నారు. అనంత్ అంబానీ నాయకత్వం జంతు సంరక్షణలో కరుణ, దయ యొక్క కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నిర్దేశించింది. వంతారా ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన జంతు సంరక్షణ చొరవగా మారుస్తుందని తెలిపారు.

Exit mobile version