Site icon NTV Telugu

Anant Ambani: పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి.. వారికి ప్రత్యేక విందు

Marriage

Marriage

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani) ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani)-రాధిక మర్చంట్ (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో (Gujarat Jamnagar) జరగనున్నాయి.

అయితే జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలను అన్న సేవతో ప్రారంభమయ్యాయి. ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, కుటుంబ సభ్యులు గ్రామస్తులకు ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశారు. సాంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని స్వయంగా వడ్డించారు.

ఈ కార్యక్రమంలో రాధిక మర్చంట్ అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్ అన్న సేవలో పాల్గొన్నారు. సుమారు 51 వేల మంది స్థానిక నివాసితులకు ఆహారం వడ్డించారు. ఈ కార్యక్రమం కొద్ది రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మార్చి 1 నుంచి జరిగే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి మాత్రం ప్రపంచ వ్యాప్తంతా ఉన్న 1000 మంది అతిరథమహరథులు పాల్గొనబోతున్నారు. వీరి కోసం 2500 రకాలైన ఫుడ్ ఐటెమ్స్ తయారు చేస్తున్నారు.

 

 

Exit mobile version