Site icon NTV Telugu

Anant Ambani: అనంత్ అంబానీ చేతి వాచ్ దొరికితే రెండు తరాల పాటు కూర్చుని తింటూ బతికేయొచ్చు

Anant Ambani Costly Diamond Watch

Anant Ambani Costly Diamond Watch

Anant Ambani: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన ఇంట్లో చిన్న వేడుక అయినా, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, వివిధ సినీ పరిశ్రమలకు చెందిన సినీ తారలు, రాజకీయ నేతలను ఆహ్వానిస్తారు. పిలుపు రాగానే ప్రముఖ తారలంతా అంబానీ ఇంటికి పోటెత్తారు. అయితే తాజాగా ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. భక్తిశ్రద్ధలతో వినాయకుడిని దర్శించుకున్న అనంతరం తిరునాళ్లలో పాల్గొన్నారు.

Read Also:Tamilnaadu: తమిళనాడులో కలకలం.. నెల రోజుల్లో తొమ్మిది పెద్ద పులులు మృతి

ఇక ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఒక్క గడియారం దొరికితే… 2 తరాల వరకు ఎలాంటి కష్టం లేకుండా బతుకు వెళ్లదీయొచ్చు. ఎందుకంటే ఆ వాచ్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. అనంత్ అంబానీ ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ వాచ్‌ని ధరించారు. 436 కట్ డైమండ్స్, బంగారంతో ఈ గడియారం తయారు చేయబడింది. ధర విషయానికొస్తే… అనంత్ అంబానీ ధరించిన వాచ్ రూ. 14.15 కోట్లు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు అంబానీ కొడుకు అంటే ఆ మాత్రం ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also:Indian Army Jobs: పది అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే..

Exit mobile version