మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా రోడ్డు పక్కన ఫుడ్ కార్ట్‌పై రోల్స్ చేస్తున్న యువకుడి వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఆ విడియోలో జస్‌ప్రీత్ అనే 10 ఏళ్ల అబ్బాయి ఎగ్ రోల్‌ను తయారు చేయడం చూడవచ్చు. ఈ వయసులో ఎందుకు కష్టపడుతున్నావని ఓ వ్యక్తి ఆ అబ్బాయిని అడగడంతో అతడు ఇలా సమాధానమిచ్చాడు. “నా తండ్రి ఇటీవల మెదడు క్షయవ్యాధితో మరణించాడు. 14 ఏళ్ల సోదరి కూడా ఉంది. నా తల్లి మా బాధ్యతలు తీసుకోవడానికి నిరాకరించింది. మమ్మల్ని వదిలేసింది.” ఈ బాలుడు ఉదయం పాఠశాలకు వెళ్తూ.. సాయంత్రం తన ఆహార బండిని నడుపుతాడు. ఎగ్ రోల్స్‌తో పాటు, చిన్న పిల్లవాడు చికెన్ రోల్స్, కబాబ్ రోల్స్, పనీర్ రోల్స్, చౌమీన్ రోల్స్ మరియు సీక్ కబాబ్ రోల్స్ కూడా విక్రయిస్తాడు.
READ MORE: Pushkar Singh Dhami: కారు కార్ఖానాలోకి పోయింది.. చేతి పని అయిపోయింది..
వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర తన ఎక్స్ అకౌంట్లో “ధైర్యం, నీ పేరు జస్ప్రీత్. కానీ అతని చదువు దెబ్బతినకూడదు. అతను ఢిల్లీలోని తిలక్ నగర్ కి చెందిన వాడనుకుంటున్నాను. అతని కాంటాక్ట్ నంబర్‌కు ఎవరైనా పంపండి. మహీంద్రా ఫౌండేషన్ బృందం కూడా అన్వేషిస్తుంది. అతని చదువుకు తోడ్పడతాము.” ఇలా రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ.. చాలా మంది జస్‌ప్రీత్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. బాలుడు చాలా ధైర్య వంతుడని.. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతాడని పలువురు కామెంట్ చేశారు. అలాగే అతడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఆనంద్ మహీంద్రను మహీంద్రా ఫౌండేషన్ ముందుకు రావడం గొప్ప విషయమని.. బాలుడిని చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని రాసుకొచ్చారు.
delhi