Site icon NTV Telugu

Anam Venkata Ramana Reddy: ధర్మారెడ్డి ఓ దొంగ, బ్రోకర్‌.. టీటీడీ ఈవోపై విరుచుకుపడ్డ టీడీపీ నేత

Anam Venkata Ramana Reddy

Anam Venkata Ramana Reddy

Anam Venkata Ramana Reddy: టీటీడీ ఇంచార్జ్‌ ఈవో ధర్మారెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీటీడీ ఇంఛార్జ్‌ ఈవో ధర్మా రెడ్ది ఒక దొంగ.. ఒక బ్రోకర్ అని విమర్శించారు. ఇక, ధర్మారెడ్డి ఛాలెంజ్ ను నేను స్వీకరిస్తున్నా.. చల్లా కొండయ్య కమిషన్ నిర్ణయాలను ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఆమెదించింది.. రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రి అయినా తర్వాత టైటిఫిలో ధర్మారెడ్డి వోఎస్‌డీగా నియమితులయ్యాడు.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కొత్త పోస్ట్ సృష్టించి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించారు.. వైఎస్ కుటుంబం కోసం ఢిల్లీలో చక్రం తిప్పే ధర్మారెడ్డికి తిరుమలలో ఉద్యోగం ఇచ్చారు అని విమర్శించారు. 1987 చట్టం ప్రకారం ఈవో, జేఈవో ఉండగా అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ఎలా నియమిస్తారు. దీనికి అసెంబ్లీ ఆమోదం ఉందా..? అసెంబ్లీ ఆమోదం లేదు కాబట్టే ధర్మారెడ్డి ఒక డమ్మీ అని వ్యాఖ్యానించారు.

రక్షణ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డి తన స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పుకోవడం సిగ్గుచేటు.. తహసీల్దార్, ఆర్డీవోగా కూడా పని చేయని ధర్మారెడ్డికి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అర్హత లేదన్నారు వెంకటరమణారెడ్డి. ధర్మారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఫేక్ ఆఫీసర్.. రూ. 4వేల కోట్లున్న తిరుమల బడ్జెట్ కు ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ ఆఫీసర్ ను అధికారిగా చంద్రబాబు వేశారు.. ఐ.ఆర్.ఎస్ అధికారి ఉంటే దేవస్థానం డబ్బులు దొంగిలించడానికి వీలు ఉండదు కాబట్టి.. ఒక ఛార్టర్డ్ అకౌంట్ గా ఉన్న ఆఫీసర్ ను చీఫ్ అకౌంట్ ఆఫీసర్ గా నియమించారు అని గుర్తుచేశారు. ఇక, వైఎస్‌ వివేకానంద రెడ్ది హత్యలో ధర్మారెడ్డికి సంబంధం ఉంది అని సంచలన ఆరోపణలు చేశారు. స్వయాన వివేకానంద రెడ్ది కూతురు సునీతానే ఈ విషయం చెప్పిందన్న ఆయన.. సెంట్రల్ సర్వీసెస్ లో ఉన్న ధర్మారెడ్డికి ఢిల్లీలో వైఎస్‌ అవినాష్ రెడ్ది ఇంట్లో ఏం పని? సమయం, ప్లేస్ ఎప్పుడు చెప్పినా నేను ధర్మారెడ్డి విసిరిన ఛాలెంజ్ కి సిద్ధం.. త్వరలో వీఆర్ఎస్ తీసుకొని ధర్మారెడ్డి.. నంద్యాల లోక్ సభ స్థానం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగాలని భావిస్తున్నారని దుయ్యబట్టారు.

ఇక, శ్రీ వేంకటేశ్వర స్వామిని చూసి ప్రేమతో డోనేషన్లు ఇస్తుంటే.. తన వల్లే వస్తున్నాయి అనడం సిగ్గుచేటు.. అంటూ మండిపడ్డారు వెంకటరమణారెడ్డి.. నాలుగేళ్లలో 16 వేల కోట్ల రూపాయల నిధులను ఇష్టనుసారం ఖర్చు పెట్టారు.. ప్రతీ లెక్కా తేల్చుతాం.. అని వార్నింగ్‌ ఇచ్చారు. తిరుమల అభివృద్ధి కోసం చంద్రబాబు నిబద్దతతో పనిచేశారని తెలిపారు. అయితే, ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న ఆర్ధిక లావాదేవిలపై విచారణ జరపాలన్నారు. ఢిల్లీలో సీఎం వైఎస్‌ జగన్ కు బ్రోకరేజ్ చేస్తున్న ధర్మారెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి..

Exit mobile version