Delhi: మరోసారి ఉలిక్కిపడ్డ దేశ రాజధాని.. ఢిల్లీలో భారీ పేలుడు

  • ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లో భారీ పేలుడు
  • సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు
  • సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
  • పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా
Delhi

Delhi

దేశ రాజధానిలో మరోసారి పేలుడు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం పెద్ద ఎత్తున వినిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం.. గురువారం ఉదయం 11:58 గంటలకు పేలుడు గురించి సమాచారం అందింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు పంపించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఉన్న బన్సీ స్వీట్స్ ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. అంతకుముందు అక్టోబర్ 20న కూడా ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది.

READ MORE: PM Modi-Threat call: “ఆయుధం తయారైంది?.. మోడీని చంపేస్తాం”.. ప్రధానిని బెదిరిస్తూ ఫోన్ కాల్..