NTV Telugu Site icon

Bomb Threat: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు

Taj Mahal

Taj Mahal

Bomb Threat For Taj Mahal: ప్రపంచంలోనే అత్యంత అందమైన కట్టడాలలో ఒకటి, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఇందుకు సంబంధించి ఓ బెదిరింపు మెయిల్‌ను పర్యాటక శాఖకు పంపారు. ఈ ముప్పుతో తాజ్ మహల్ చుట్టూ భద్రతను పెంచారు. మరోవైపు, తాజ్ మహల్ లోపల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో తాజ్ మహల్ సెక్యూరిటీ పోలీసులు, ఇతరత్రా సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు మెయిల్ పంపిన వారిని ట్రేస్ చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.

Also Read: Chapped Lips: చలికాలంలో పెదవులు పగిలినట్లైతే.. ఈ ఇంటి చిట్కాలను అనుసరిస్తే సరి

ఇక ఈ విషయమై ఎసిపి తాజ్ సెక్యూరిటీ సయ్యద్ అరిబ్ అహ్మద్ మాట్లాడుతూ.. పర్యాటక శాఖకు ఈమెయిల్ వచ్చిందని, దాని ఆధారంగా తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడిందని తెలిపారు. ఇక ప్రస్తుతం ఘటన సంబంధించి తదుపరి విచారణ అధికారులు చేపడుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments