Site icon NTV Telugu

Earthquake : మణిపూర్ లో భూకంపం.. భయంతో జనం పరుగులు

Earthquake

Earthquake

Earthquake : మణిపూర్ లో శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్ లో భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు అయింది. ఉన్నట్లుండి ఒక్క సారిగా భూమిలో కంపనాలు కనిపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఉఖ్రుల్ కు 94 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదని అధికారులు తెలిపారు.

Read Also: Online Betting: కోటి వచ్చిందన్న ఆనందంలో కోతి చేష్టలు.. కొట్టుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు

శుక్రవారం రాత్రి కూడా పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 3.2గా నమోదు అయింది. షామ్లీ కేంద్రంగా రాత్రి 9.31 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంపాలపై ఎన్ సీఎస్ తాజా నివేదికల ప్రకారం.. డిసెంబర్ నెలలో భారత్ లో 38 భూకంపాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్‌లలో అత్యధికంగా భూకంపాలు సంభవించాయ. ఈ కాలంలో ఒక్కో రాష్ట్రంలో 6 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయని నివేదిక పేర్కొంది.

Read Also: Kidnapping: చాకెట్లు కొనిస్తానని కిడ్నాప్‌.. చాకచక్యంగా బయటపడ్డ చిన్నారులు

Exit mobile version