NTV Telugu Site icon

American Girl: PUBG గేమ్లో పరిచయం.. యువకుడి కోసం అమెరికా నుంచి ఢిల్లీకి

Pub G

Pub G

పబ్జీ గేమ్లో పరిచయం.. దేశాలు దాటేలా చేసింది. గతంలో పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ ఇదే పబ్జీలో ఇండియాకు చెందిన సచిన్తో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో.. తన భర్తను వదిలేసి పిల్లలతో ఇండియాకు వచ్చింది. ఈ ఘటన అప్పుడు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా.. పబ్జీ గేమ్లో యూపీ ఇటావాకు చెందిన ఓ యువకుడితో అమెరికా అమ్మాయికి పరిచయం ఏర్పడింది. అంతటితో ఆగకుండా.. ఆ బాలిక యువకుడిని కలవడానికి ఇటావా వచ్చింది. అక్కడి నుంచి ఆమె రోడ్డుమార్గం ద్వారా బస్సులో ఢిల్లీకి వెళుతుండగా.. షికోహాబాద్ పోలీసులు బాలికను బస్సు నుంచి దించి విచారించారు. విచారణ అనంతరం బాలికను ఢిల్లీ మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించారు. PUBG ఆడుతున్నప్పుడు అమెరికన్ అమ్మాయి ఇటావా నివాసి హిమాన్షు అనే అబ్బాయితో స్నేహం చేసింది. దీంతో.. ఆ అమ్మాయి టూరిస్ట్ వీసాపై మొదట చండీగఢ్ చేరుకుంది. అక్కడ నుండి ఇటావాకు వచ్చింది. అమెరికా ఫ్లోరిడాలోని హోమ్స్ క్రీక్ రోడ్ గ్రేస్‌విల్లే నివాసి బ్రూక్లిన్ కార్న్లీ అనే అమ్మాయికి పబ్జీ ఆడటమంటే ఇష్టం. పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు.. చండీగఢ్ నివాసి యువి వాంగో అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో.. అమెరికా అమ్మాయి బ్రూక్లిన్ టూరిస్ట్ వీసాపై ఇండియా వచ్చి మూడు నెలలు చండీగఢ్‌లోని యువీ బాంగో ఫ్లాట్‌లో నివసించింది.

Delhi: సివిల్స్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆదివారం ఉదయం 6 గంటలకే మెట్రో సేవలు

ఈ క్రమంలో.. బ్రూక్లిన్ మళ్లీ PUBG ఆడటం మొదలుపెట్టినప్పుడు, ఫరీదాబాద్‌లోని ఇటావా నివాసి హిమాన్షు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో.. ఆమె హిమాన్షుతో కలిసి ఇటావాకు వచ్చింది. చాలా రోజులు ఇటావాలో ఉన్న తర్వాత.. బ్రూక్లిన్ యూపీ రోడ్‌వేస్ ద్వారా బస్సులో ఢిల్లీకి వెళుతోంది. ఇంతలో.. షికోహాబాద్‌లో ఓ ప్రయాణికుడికి అమెరికన్ అమ్మాయి, భారతీయ అబ్బాయి మధ్య జరిగిన సంభాషణపై అనుమానం రావడంతో అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని బస్సును నిలిపివేశారు. అక్కడి నుంచి బాలికను, హిమాన్షుని షికోహాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిద్దరినీ క్షుణ్ణంగా విచారించారు. డాక్యుమెంట్ల పరిశీలనలో ఆ అమ్మాయి అమెరికా నుంచి టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చిందని, అక్కడ పబ్‌జి ఆడుతున్నప్పుడు చాలా మంది భారతీయులతో స్నేహం ఏర్పడిందని తేలింది.

CM Chandrababu: నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్..

షికోహాబాద్ పోలీస్ స్టేషన్ చీఫ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. బాలికకు హిందీ రాదు.. యువకుడికి ఇంగ్లీష్ రాదని తెలిపారు. వారిద్దరూ గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారా ఒకరితో ఒకరు సంభాషించుకునేవారని పేర్కొన్నారు. మరోవైపు.. ఇంటెలిజెన్స్, LIU కూడా యువకుడిని అర్థరాత్రి వరకు విచారించింది. అనంతరం హిమాన్షును అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. మహిళా కానిస్టేబుల్‌తో పాటు అమెరికా అమ్మాయిని ఢిల్లీకి పంపించారు.