NTV Telugu Site icon

Air force plane crashes: కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం.. పోలాల్లో పడి బూడిదైన జెట్..

Air Force Plane

Air Force Plane

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రాలోని కగరౌల్‌లోని సోనిగా గ్రామ సమీపంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం కూలిపోయింది. విమానం ఖాళీ పొలాల్లో పడిపోయింది. విమానం నేలపై పడిన వెంటనే మంటలు చెలరేగాయి. విమానంలో పైలట్‌తో సహా ఇద్దరు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం విశేషం. ఇది ఎయిర్‌ఫోర్సుకు చెందిన మిగ్‌-29 జెట్‌ విమానంగా గుర్తించారు. పంజాబ్‌ అదంపూర్‌ నుంచి ఆగ్రా వెళ్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోనే ఫైటర్ జెట్ బ్లాక్ బాక్స్ కూడా పడి ఉంది.

READ MORE: Dulquer : తెలుగు ప్రేక్షకుల ప్రేమ చూసి ఆశ్చర్యపోయా.. అదే కొత్తగా అనిపించింది: దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూ

అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా? లేదా ప్రమాదానికి మరేదైనా కారణా అని దర్యాప్తు చేస్తున్నారు. విమానం పంజాబ్‌లోని అదంపూర్‌ నుంచి బయలుదేరి ప్రాక్టీస్‌ కోసం ఆగ్రా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఆగ్రా కంటోన్మెంట్ నుంచి ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. మంటల కారణంగా విమానం పూర్తిగా కాలి బూడిదైంది. అనేక సందర్భాల్లో, MiG-29 విమానాలు భారతదేశానికి నమ్మదగనివిగా నిరూపించబడ్డాయి. ఈ యుద్ధ విమానాలను 1987లో అధికారికంగా భారత సైన్యంలోకి చేర్చారు. 2022 నాటికి దాదాపు 115 MiG-29 విమానాలు భారతదేశంలో సేవలు అందిస్తున్నాయి. అయితే.. వీటిలో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి.

Show comments