Site icon NTV Telugu

Amritpal Singh: అమృతపాల్ సింగ్ ఆస్తుల విలువ రూ.వెయ్యి.. అఫిడవిట్ లో వెల్లడి

Amritpal Singh

Amritpal Singh

ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే. జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద ప్రస్తుతం అసోంలోని దిబ్రూఘర్ జైలులో ఉన్నాడు. శుక్రవారం తర్న్ తరణ్ జిల్లాలో అమృతపాల్ సింగ్ తరఫున అతడి మామ నామినేషన్ దాఖలు చేశారు. సింగ్ గురువారం అసోంలోని దిబ్రూగఢ్ జైలులో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

READ MORE: Instagram Reels: గన్ చేతిలో పట్టుకుని హైవేపై స్టెప్పులేసిన యువతి.. తరువాత ఏమైందంటే..?

ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. అమృత్‌సర్‌ రయ్యాలోని ఎస్ బీఐ(SBI) బ్రాంచ్‌లో సింగ్‌కు రూ. 1,000 బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఇది కాకుండా.. సింగ్‌కు ఎటువంటి చర, స్థిర ఆస్తులు లేవని ఆఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌కు రూ.18.37 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో రూ. 20,000 నగదు, రూ. 14 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 4,17,440కి సమానమైన 4,000 GBP (పౌండ్లు) ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి లండన్‌లో ఉన్న రివోల్ట్ లిమిటెడ్ (Revolut Limited) ఖాతాలో ఉన్నట్లు చూపించారు. సింగ్ తన తల్లిదండ్రులపై ఆధారపడిన జీవిస్తున్నట్లు అందులో ఉంది. అతని భార్య బ్రిటిష్ పౌరురాలు.. కాగా.. ఆమె గతంలో UKలోని నేషనల్ హెల్త్ సర్వీసెస్‌లో భాషా ఇంటర్‌ప్రెటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం గృహిణి.

తనపై 12 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమృతపాల్ పేర్కొన్నారు. అయితే ఏ కేసులోనూ తనకు శిక్ష పడలేదని చెప్పారు. అతను తన తొమ్మిది మంది సహచరులతో ఏప్రిల్ 2023 నుంచి దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. 2008లో, అతను అమృత్‌సర్‌లోని ఫెరుమాన్‌లోని ఒక పాఠశాల నుంచి మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించాడు.
తన మద్దతుదారుల అభ్యర్థన మేరకు తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అమృతపాల్ తండ్రి టార్సెమ్ సింగ్ ప్రకటించారు. అమృతపాల్‌కు సిమ్రంజిత్ సింగ్ మాన్, పరమ్‌జిత్ కౌర్ ఖల్దా మద్దతు లభిస్తోంది.

Exit mobile version