Amritpal Singh: అమృతపాల్ సింగ్ ఆస్తుల విలువ రూ.వెయ్యి.. అఫిడవిట్ లో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే. జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద ప్రస్తుతం అసోంలోని దిబ్రూఘర్ జైలులో ఉన్నాడు. శుక్రవారం తర్న్ తరణ్ జిల్లాలో అమృతపాల్ సింగ్ తరఫున అతడి మామ నామినేషన్ దాఖలు చేశారు. సింగ్ గురువారం అసోంలోని దిబ్రూగఢ్ జైలులో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
READ MORE: Instagram Reels: గన్ చేతిలో పట్టుకుని హైవేపై స్టెప్పులేసిన యువతి.. తరువాత ఏమైందంటే..?
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. అమృత్‌సర్ రయ్యాలోని ఎస్ బీఐ(SBI) బ్రాంచ్‌లో సింగ్‌కు రూ. 1,000 బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఇది కాకుండా.. సింగ్‌కు ఎటువంటి చర, స్థిర ఆస్తులు లేవని ఆఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన భార్య కిరణ్‌దీప్ కౌర్‌కు రూ.18.37 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో రూ. 20,000 నగదు, రూ. 14 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 4,17,440కి సమానమైన 4,000 GBP (పౌండ్లు) ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి లండన్‌లో ఉన్న రివోల్ట్ లిమిటెడ్ (Revolut Limited) ఖాతాలో ఉన్నట్లు చూపించారు. సింగ్ తన తల్లిదండ్రులపై ఆధారపడిన జీవిస్తున్నట్లు అందులో ఉంది. అతని భార్య బ్రిటిష్ పౌరురాలు.. కాగా.. ఆమె గతంలో UKలోని నేషనల్ హెల్త్ సర్వీసెస్‌లో భాషా ఇంటర్‌ప్రెటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం గృహిణి.
తనపై 12 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అమృతపాల్ పేర్కొన్నారు. అయితే ఏ కేసులోనూ తనకు శిక్ష పడలేదని చెప్పారు. అతను తన తొమ్మిది మంది సహచరులతో ఏప్రిల్ 2023 నుంచి దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. 2008లో, అతను అమృత్‌సర్‌లోని ఫెరుమాన్‌లోని ఒక పాఠశాల నుంచి మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించాడు.
తన మద్దతుదారుల అభ్యర్థన మేరకు తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అమృతపాల్ తండ్రి టార్సెమ్ సింగ్ ప్రకటించారు. అమృతపాల్‌కు సిమ్రంజిత్ సింగ్ మాన్, పరమ్‌జిత్ కౌర్ ఖల్దా మద్దతు లభిస్తోంది.
తాజావార్తలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!