Amritpal Singh Wife: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లండన్ వెళ్లే విమానం మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కిరణ్‌దీప్‌ను ఇప్పుడు కస్టమ్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారని సమాచారం.
Read Also: Father: ఆ తండ్రి గురించి తెలుసుకోవాల్సిందే.. కూతురి చికిత్స కోసం రక్తాన్ని దారబోశాడు.. కానీ చివరకు!
పంజాబ్ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. కిరణ్‌దీప్ యునైటెడ్ కింగ్‌డమ్ పౌరురాలు, యూకే పాస్‌పోర్ట్ హోల్డర్. ఆమెపై పంజాబ్‌లో కానీ, దేశంలో కానీ ఎలాంటి కేసు నమోదు కాలేదు. అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ యూకేలో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నట్లు పంజాబ్ పోలీసులు లేదా కేంద్ర ఏజెన్సీల వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేదా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. మార్చిలో అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ప్రశ్నించారు.